HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > News
  • >Big Twist In Tamil Politics Ruckus In Aiadmk

AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

  • Author : Vamsi Chowdary Korata Date : 06-05-2026 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TVK Rules Out Talks With AIADMK
TVK Rules Out Talks With AIADMK

తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన అన్నాడీఎంకేలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేడు చెన్నైలో జరగాల్సిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అకస్మాత్తుగా రద్దయింది. టీవీకేకు మద్దతిచ్చే అంశంపై పార్టీలో తీవ్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ పరిణామం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది సభ్యుల మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగా నిలిచింది. ఈ నేపథ్యంలో 47 మంది ఎమ్మెల్యేలున్న అన్నాడీఎంకే మద్దతు కీలకంగా మారింది.

టీవీకేకు బయటి నుంచి మద్దతు ఇచ్చే విషయంపై అన్నాడీఎంకేలో అంతర్గత చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలని పట్టుబడుతుండగా, పార్టీలోని సీనియర్లు, మరికొందరు దానిని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ తీవ్రమైన భిన్నాభిప్రాయాల కారణంగానే పార్టీ అధినేత పళనిస్వామి సమావేశాన్ని రద్దు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సమావేశం రద్దుపై పార్టీ అధికారికంగా ఎలాంటి కారణం చెప్పకపోవడంతో, తదుపరి ఏం జరగనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIADMK
  • Edappadi K Palaniswami
  • political crisis
  • Tamil Nadu Government Formation
  • tamil nadu politics
  • Tamilaga Vetri Kazhagam
  • thalapathy vijay
  • Vijay thalapathy

Related News

Raghava Lawrence clarifies stance on political entry

Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించి తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా ఆ జాబితాలో ఇప్పుడు లారెన్స్ కూడా చేరారు. Do your duty sincerely, without expecting anything in return. After watching this video, please share your a

    Latest News

    • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

    • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

    • TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd