HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Will Trisha Contest As An Mla From That Very Constituency

TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

  • Author : Vamsi Chowdary Korata Date : 05-05-2026 - 10:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tvk Mla Trisha
Tvk Mla Trisha

TVK తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభంజనం సృష్టించింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఈ పార్టీ, ఊహించని రీతిలో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజ‌యం సాధించ‌డం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అనూహ్య విజయం నేపథ్యంలో ప్రముఖ కథానాయిక త్రిష రాజకీయ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. టీవీకే తరఫున ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో ఆయన గెలిచారు. అయితే, నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం విజయ్ పెరంబూర్‌ను అట్టిపెట్టుకుని తిరుచ్చి ఈస్ట్‌ స్థానాన్ని వదులుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో అక్కడ జరగబోయే ఉప ఎన్నికలో టీవీకే అభ్యర్థిగా త్రిష బరిలోకి దిగుతారని ‘దినమణి’ పత్రిక తన కథనంలో పేర్కొంది.

ఎన్నికల ఫలితాల్లో టీవీకే ఆధిక్యం స్పష్టమవుతున్న సమయంలో నటి త్రిష చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

టీవీకే హామీల అమలుపైనే అందరి దృష్టి
టీవీకే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ పార్టీ ఎన్నికల వాగ్దానాలపై నిలిచింది. తాము అధికారంలోకి వస్తే పెళ్లికూతుళ్లకు 8 గ్రాముల బంగారం, మహిళా కుటుంబ పెద్దలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అలాగే, “నిజాయతీతో కూడిన పరిపాలన” అందిస్తామని ప్రకటించింది. సంక్షేమ పథకాల అమలుకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని పార్టీ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి.

వీటితో పాటు ఐదు లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు ఐదు లక్షల పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.4,000 భృతి, ఉన్నత చదువుల కోసం రూ.20 లక్షల వరకు విద్యా రుణాలు వంటి హామీలు కూడా టీవీకే మేనిఫెస్టోలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఈ భారీ హామీలను ఎలా అమలు చేస్తుందనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heroine Trisha
  • Perambur and Trichy East Constituencies
  • Perambur Constituency
  • tamil nadu politics
  • Tamilaga Vetri Kazhagam
  • Trisha Krishnan
  • tvk
  • Vijay thalapathy

Related News

Huge remuneration after a hit... Trisha shocks producers.

Trisha: హిట్‌తో భారీ రెమ్యునరేషన్.. నిర్మాతలుకు త్రిష షాక్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేస్తూ, అభిమానులతో ముద్దుగా ‘చెన్నై చంద్రం’గా పిలిపించుకునే నటి త్రిష కృష్ణన్… వయసుతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన నటనతో నేటికీ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ఆమె ఎంచుకుంటున్న కథలు, నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు సాధిస్తుండటంతో కోలీవుడ్, టాలీవుడ్‌లలో త్ర

  • Raghava Lawrence clarifies stance on political entry

    Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

Latest News

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

  • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

  • TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd