Manorama Khedkar: మనోరమ ఖేద్కర్ జైలు నుంచి పరుగో పరుగు
రైతును బెదిరించిన కేసులో మనోరమ ఖేద్కర్‌ను పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె జైలు నుంచి విడుదలైంది.అయితే మీడియా నుంచి తప్పించుకొనేందుకు ఆమె పరుగు పెట్టింది.
- By Praveen Aluthuru Published Date - 09:36 PM, Sat - 3 August 24

Manorama Khedkar: రైతులను బెదిరించిన కేసులో పూజా ఖేద్కర్ తల్లి మనోరమ దిలీప్ ఖేద్కర్‌కు ఊరట లభించింది. పూణే అదనపు సెషన్స్ కోర్టు నుంచి బెయిల్ పొందడంతో ఆమె ఎరవాడ సెంట్రల్ జైలు నుంచి విడుదలైంది. ఈ సమయంలో ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మీడియా కెమెరాల నుంచి తప్పించుకుని పారిపోతున్నట్లు కనిపిస్తుంది. రైతును బెదిరించిన కేసులో మనోరమ ఖేద్కర్‌ను పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
#WATCH | Pune: Manorama Khedkar mother of Puja Khedkar released from Yerawada Central Jail after she was granted bail by Pune Additional Sessions Court
She was arrested by Pune Rural Police last month in connection with a case filled in Paud police station for threatening a… pic.twitter.com/HWYkI2kAit
— ANI (@ANI) August 3, 2024
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌కు చెందిన మనోరమ ఖేద్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కూతురు పూజ ఖేద్కర్ ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్న సమయంలో మనోరమ ఖేద్కర్‌కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా ఐఏఎస్‌గా మారిన పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ కీలక చర్య తీసుకుంది. యూపీఎస్సీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అలాగే యూపీఎస్సీ పరీక్షకు హాజరుకాకుండా జీవితకాల నిషేధం విధించారు. పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది.
IAS अधिकारी पूजा खेडकर यांच्यावर विविध आरोप होत असतानाच आता त्यांच्या अडचणी आणखी वाढल्या आहेत. पूजा खेडकर यांची आई मनोरमा यांचा मुळशी तालुक्यातील धडवली गावातला पिस्तूल घेऊन नागरिकांना धमकवतानाचा जुना व्हिडिओ व्हायरल होत आहे.https://t.co/2jrmCKvB4K pic.twitter.com/UY5G1sd9Xc
— LoksattaLive (@LoksattaLive) July 12, 2024
వివాదం ఏంటంటే.. ముల్షి ప్రాంతానికి చెందిన రైతుల భూమిని విక్రయించాలని బలవంతం చేసింది. మనోరమా ఖేద్కర్ కొందరు రైతులను బెదిరించినట్లు ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంలో మనోరమపై కేసు నమోదైంది. దీని తర్వాత మనోరమ మరియు ఆమె భర్త దిలీప్ ఖేద్కర్ హఠాత్తుగా కనిపించకుండా పోయారు. ఆ తర్వాత మనోరమ ఖేద్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులను బెదిరించేందుకు ఉపయోగించిన పిస్టల్‌ను, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: UPSC Aspirant Dies: యూపీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్