Indian Youth : డబ్బుకు ఆశపడివెళ్లి ..బలిపశువులైన యువకులు
Indian Youth : రష్యాలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు (Security Guards) ఉన్నాయని ఆశ చూపిన ఏజెంట్లు రాకేశ్, బ్రజేశ్‌లను మోసపూరితంగా తీసుకెళ్లారు
- Author : Sudheer
Date : 27-01-2025 - 6:20 IST
Published By : Hashtagu Telugu Desk
విదేశాల్లో ఉద్యోగం చేసే ఆశతో డబ్బు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో వెళ్లిన యువకులు ఏజెంట్ల చేతుల్లో మోసపడి దారుణ పరిస్థితులను ఎదురుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం( Russia-Ukraine war)లో చిక్కుకున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాకేశ్ (Rakesh), మధ్యప్రదేశ్‌కు చెందిన బ్రజేశ్( Brajesh)ల విషాదకథ ఇప్పుడు యువతకు ఓ పాఠంలా మారింది.
MUDA : ముడా స్కామ్‌లో సీఎం భార్యకు ఈడీ నోటీసులు
రష్యాలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు (Security Guards) ఉన్నాయని ఆశ చూపిన ఏజెంట్లు రాకేశ్, బ్రజేశ్‌లను మోసపూరితంగా తీసుకెళ్లారు. రష్యా చేరుకున్న వారికి ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. శిక్షణ పేరుతో రహస్య ప్రదేశాలకు తీసుకెళ్లి వారిని బలవంతంగా రష్యా సైన్యానికి అమ్మకంగా మార్చారు. ఆధునిక ఆయుధాలతో శిక్షణ ఇచ్చి, వారిని యుద్ధంలో వాడుకున్నారు. మొదట్లో సైనిక శిబిరాల్లో చిన్నచిన్న పనులు చేయించారు. కానీ యుద్ధంలో సైనికుల సంఖ్య తగ్గిపోవడంతో వారిని నేరుగా యుద్ధానికి తరలించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక దాడులలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాకేశ్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తమ ఆవేదనను చెప్పుకొచ్చారు. కేంద్రం తక్షణ చర్యలతో ఈ ఇద్దరు యువకులు ప్రాణాలతో స్వదేశానికి చేరుకోగలిగారు. అయితే వారితో పాటు మరెంతో మంది యువతీయువకులు ఇలాగే యుద్ధభూమిలో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇలాంటివి పునరావృతం కాకుండా, యువత విదేశీ ఉద్యోగ అవకాశాలను శ్రద్ధగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మరియు అధికారులు ఇలాంటి మోసాలను గుర్తించి, బాధితులను రక్షించేందుకు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.