Thailand : బ్యాట్‌మొబైల్‌లో వివాహానికి వచ్చిన వరుడు..నెటిజన్లు సరదా కామెంట్లు..!
ఈ వీడియోను "friendsstudio.in" అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో "ఫెనిల్ లేకే నిక్లా అప్నీ ఖుషియోం కి బారత్, ధోల్ నగాడే ఔర్ దోస్తో కే సాథ్!" అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. వీడియోలో వరుడు ఫెనిల్, డోల్లు మోగుతుండగా తన స్నేహితులతో కలిసి ఆనందంగా స్టెప్పులేస్తూ, తన సూపర్ స్టైల్‌కి తగ్గట్టుగా బ్యాట్‌మొబైల్‌లో బయలుదేరిన దృశ్యాలు కనపడతాయి.
- By Latha Suma Published Date - 02:24 PM, Sun - 24 August 25

Thailand : వివాహ వేడుకలన్నా, వధూవరుల రాకలన్నా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. కానీ థాయిలాండ్‌లో జరిగిన ఓ భారతీయ వివాహంలో వరుడు చేసిన ‘ఎంట్రీ’ మాత్రం అసలు అదుర్స్. సినిమాల్లో మాత్రమే కనిపించే డీసీ కామిక్స్ సూపర్ హీరో “బ్యాట్‌మ్యాన్” కోసం రూపొందించిన బ్యాట్‌మొబైల్ కారులోనే వరుడు పెళ్లి వేదికకు చేరుకున్నారు. ఆయన రాకకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను “friendsstudio.in” అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో “ఫెనిల్ లేకే నిక్లా అప్నీ ఖుషియోం కి బారత్, ధోల్ నగాడే ఔర్ దోస్తో కే సాథ్!” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. వీడియోలో వరుడు ఫెనిల్, డోల్లు మోగుతుండగా తన స్నేహితులతో కలిసి ఆనందంగా స్టెప్పులేస్తూ, తన సూపర్ స్టైల్‌కి తగ్గట్టుగా బ్యాట్‌మొబైల్‌లో బయలుదేరిన దృశ్యాలు కనపడతాయి. అతని హుందాగా అలంకరించిన బ్యాట్‌మొబైల్, ఆ ప్రకటనల శబ్దం మధ్య అందరి దృష్టిని ఆకర్షించింది.
Read Also: Telangana: ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం : హరీశ్ రావు
సాధారణంగా వరుడు గుర్రపు బండి లేదా సాధారణ డెకొరేషన్ కారుతో వచ్చేవాడు. కానీ ఈ ఫెనిల్ మాత్రం డిఫరెంట్ ఆలోచనతో వచ్చి, తన పెళ్లి రాకను ఒక స్పెషల్ మోమెంట్‌గా మార్చుకున్నాడు. అతను కచ్చితంగా బ్యాట్‌మ్యాన్ అభిమానిగా కనిపించాడు. అతని థీమ్ ఎంట్రీను చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు సరదా కామెంట్లతో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ మిషా బోహరా సరదాగా వ్యాఖ్యానిస్తూ, “సబ్కా ఫోకస్ కార్ పర్ హే హై. కోయి దుల్హే కో భీ దేఖ్ లో” అంటూ జోక్ చేశారు. మరో యూజర్ తన్వి పాండ్య మాట్లాడుతూ, “ఫెనిల్ కి ఫైనల్ బారాత్” అని చమత్కరించారు. అదే సమయంలో Aazan_redfury అనే యూజర్ “బాట్‌మాన్-మేరీ శక్తియోన్ కా గలత్ ఇస్మాల్ హో రహా” అంటూ సినిమాల డైలాగ్‌ని జత చేశారు. Kalpit.nagrecha అనే యూజర్ తన సందేహాన్ని వ్యక్తపరుస్తూ, “బ్యాట్‌మొబైల్‌లో ఫూల్ కా సజావత్ హై క్యా?” అని అడిగారు. ఈ విశేషం చూసిన తర్వాత, పెళ్లికి వచ్చిన అతిధులు మాత్రమే కాదు, ఆన్‌లైన్ వీక్షకులు కూడా ఈ వినూత్న ఐడియాకు ఫిదా అయ్యారు. ఫెనిల్ పెళ్లి మూడ్‌ని మాత్రమే కాదు, తన ఫ్యాషన్ మరియు ఫాంటసీని కూడా అద్భుతంగా మిళితం చేసి, ఒక మరిచిపోలేని సందర్భంగా మార్చాడు. బ్యాట్‌మ్యాన్ స్టైల్ బరాత్‌తో సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన ఫెనిల్, ఇప్పుడు యువతలోకి ఒక కొత్త ఐడియాను పరిచయం చేశాడని చెప్పవచ్చు.
Read Also: Free Bus Scheme : ఉచిత బస్సు వద్దంటూ రోడ్ పై మహిళల ధర్నా