HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Girls Beware

అమ్మాయిలు జాగ్రత్త..మీతో చాట్ చేస్తుంది మామూలోళ్లు కాదు !!

తాజాగా త్రెడ్స్ (Threads) యాప్ వేదికగా జరుగుతున్న ఒక వింతైన మోసం వెలుగులోకి వచ్చింది. మహిళలతో చాటింగ్ చేసే వ్యక్తులను టార్గెట్ చేసి, పోలీసులమంటూ బెదిరిస్తూ లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న ఇద్దరు కేటుగాళ్లను కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు

  • Author : Sudheer Date : 05-02-2026 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Girls Chatting
Girls Chatting

Girls Beware : ప్రస్తుత స్మార్ట్ యుగంలో సాంకేతికత ఎంతలా పెరుగుతుందో, అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా సరికొత్త రూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్‌లను వేదికగా చేసుకుని అమాయకులను, మహిళలను బురిడీ కొట్టించే ముఠాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా త్రెడ్స్ (Threads) యాప్ వేదికగా జరుగుతున్న ఒక వింతైన మోసం వెలుగులోకి వచ్చింది. మహిళలతో చాటింగ్ చేసే వ్యక్తులను టార్గెట్ చేసి, పోలీసులమంటూ బెదిరిస్తూ లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న ఇద్దరు కేటుగాళ్లను కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్, సందీప్ కుమార్ అనే వ్యక్తులు ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు డి.ఎస్.పి ప్రమోద్ వెల్లడించారు.

ఈ నేరగాళ్ల పనితీరు అత్యంత పకడ్బందీగా సాగుతుంది. త్రెడ్స్ యాప్‌లో మహిళల ఫోటోల కింద అసభ్యకర మెసేజ్‌లు పెట్టే వారిని లేదా వారితో చాటింగ్ చేసే వారిని వీరు ముందుగా గుర్తిస్తారు. కోవెలకుంట్లకు చెందిన ప్రతాపరెడ్డి అనే వ్యక్తి ఇలాగే వీరి ఉచ్చులో చిక్కాడు. నిందితుడు చంద్రశేఖర్ తనకు తాను గద్వాల ఎస్సైగా పరిచయం చేసుకుని ప్రతాపరెడ్డికి ఫోన్ చేశాడు. “నువ్వు చాటింగ్ చేసిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది, కేసు నమోదు కాకుండా ఉండాలంటే ఆమె భర్తతో సెటిల్మెంట్ చేసుకోవాలి” అంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆ మహిళా ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉందని, చికిత్స కోసం రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పోలీసుల వేధింపులకు భయపడిపోయిన బాధితుడు ప్రాథమికంగా రూ. 30 వేలు ఫోన్ పే (PhonePe) చేశాడు. అయితే నేరగాళ్ల ఆశ అంతటితో తీరలేదు; మరింత డబ్బు కావాలంటూ టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఫోన్ పే ట్రాన్సాక్షన్ల ఆధారంగా కేవలం ఐదు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో చాటింగ్ చేసేటప్పుడు, ముఖ్యంగా అసభ్యకర సందేశాలు పంపేటప్పుడు ఇటువంటి ముఠాల బారిన పడే ప్రమాదం ఉందని, కాబట్టి నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cyber crime
  • girls chatting
  • Threads App
  • అమ్మాయిలు

Related News

    Latest News

    • యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి తలలు పట్టుకున్న నిర్మాతలు

    • లోక్‌సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!

    • అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!

    • మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..

    • అండర్-19 వరల్డ్ కప్.. ఆరోసారి టైటిల్‌పై క‌న్నేసిన భారత్!

    Trending News

      • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

      • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

      • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

      • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd