Dalailama Apologises: ఆ విషయం పట్ల విచారణ వ్యక్తం చేసిన దలైలామా.. బాలుడు కుటుంబానికి క్షమాపణలు?
తాజాగా బౌద్ధ మత గురువు దలైలామా ఒక బాలుడిని తన నాలుకతో నోటిని తాకాలి అంటూ కోరడంతో అధికార
- Author : Anshu
Date : 10-04-2023 - 4:40 IST
Published By : Hashtagu Telugu Desk
తాజాగా బౌద్ధ మత గురువు దలైలామా ఒక బాలుడిని తన నాలుకతో నోటిని తాకాలి అంటూ కోరడంతో అధికార వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఆ వీడియో పై ఫోటోలపై పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లు వెత్తుతున్నాయి. దాంతో వెంటనే బౌద్ధమత గురువు అయిన దలైలామా క్షమాపణలు తెలిపారు. ఆ బాలుడికి అతని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు.
తనను కలుసుకునే వ్యక్తులను తరచుగా అమాయకంగా ఉల్లాస భరితంగా ఆట పట్టిస్తూ ఉంటానని ఆయన తెలిపారు. అంతే కాకుండా ఆ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. తన వద్దకు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన ఒక భారతీయ బాలుడిని దగ్గరకు తీసుకొని అతని పెదవులపై దలైలామా ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. అనంతరం అతను నాలుకను బయటపెట్టి నీ నోటితో నాలుకను తాకుతావా అని అడగడం వీడియోలో స్పష్టంగా వినిపించింది.
— Dalai Lama (@DalaiLama) April 10, 2023
దాంతో నెటిజెన్స్ ఆయనపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం కరెక్ట్ గా ఉందా అంటూ దలైలామా పై మండిపడుతూ నిలదీస్తున్నారు. అయితే దలైలామా వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఒకసారి మహిళ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. సదరు బాలుడికి పై జరిగిన సంఘటన గురించి స్పందిస్తూ ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ క్షమాపణలు చెబుతూ విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..