Nurse : పేషంట్‌తో సెక్స్ చేసి అతని మరణానికి కారణమైన నర్స్.. హాస్పిటల్ యాజమాన్యం ఏం చేసిందో తెలుసా?
నర్స్ హాస్పిటల్ కి వచ్చిన ఓ పేషంట్ తో ఏకంగా సంవత్సరం నుంచి సెక్స్ సంబంధం పెట్టుకుంది.
- By News Desk Published Date - 10:00 PM, Mon - 10 July 23

సాధారణంగా నర్సులు(Nurse) హాస్పిటల్లో(Hospital) పేషంట్స్ ని(Patients) జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఈ నర్స్ హాస్పిటల్ కి వచ్చిన ఓ పేషంట్ తో ఏకంగా సంవత్సరం నుంచి సెక్స్ సంబంధం పెట్టుకుంది. ఇంగ్లాండ్ వేల్స్ లో ఓ హాస్పిటల్ లో ఓ పేషంట్ డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నాడు. చాలా కాలంగా అతను మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ ఆ హాస్పిటల్ లో డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే 42 ఏళ్ళ పెనెలోప్ విలియమ్స్ అనే ఓ నర్స్ తో పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధం వరకు వెళ్ళింది.
అయితే కొన్ని రోజుల క్రితం ఈ నర్స్ పేషంట్ తో హాస్పిటల్ లో సెక్స్ చేస్తుండగా అకస్మాత్తుగా మరణించాడు. ఇది ఆసుపత్రిలో సంచలనంగా మారింది. ఆసుపత్రిలోని పార్కింగ్ స్థలంలో అర్ధరాత్రి అతనితో సెక్స్ చేస్తుండగా అకస్మాత్తుగా మరణించాడు. అయితే తన తోటి నర్స్ లకు ఈ విషయాన్ని తెలియచేసింది. అతను మరణించాక అతన్ని పట్టించుకోలేదని, కనీసం అంబులెన్స్ ని కూడా పిలవలేదని సమాచారం.
అతను చాలా రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండటంతో పాటు సెక్స్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్లే చనిపోయాడు అని వైద్యులు తెలిపారు. యాజమాన్యం వరకు ఈ విషయం వెళ్లడంతో నర్స్ పై ఫైర్ అయ్యారు. నర్స్ తన వృత్తిని ఉల్లంఘించిందని, మెడికల్ ప్రాక్టీషనర్ గా కూడా విఫలమైందని యాజమాన్యం పేర్కొంది. దీంతో ఆమెను నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీ కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టగా మొదట అబద్దాలు చెప్పినా ఆ తర్వాత అతనితో సంబంధం ఉందంటూ జరిగింది చెప్పింది.
దీంతో నర్సింగ్ వృత్తికి చెడ్డపేరు తెచ్చిందని ఆ నర్సుని హాస్పిటల్ లో విధుల నుంచి తప్పించారు. అంతేకాకుండా ఆమె నర్సుగా ప్రాక్టీస్ కొనసాగిస్తే పేషంట్స్ కి ఆమె వృత్తిపై ఉన్న నమ్మకం కోల్పోతుందని వ్యాఖ్యానించి ఆమెని నర్స్ ప్రాక్టీస్ చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. వృత్తిని పక్కనపెట్టి పేషంట్ తో ఇలా చేయడంతో చివరికి తన జాబ్ కోల్పోవాల్సి వచ్చింది అది కూడా 42 ఏళ్ళ వయసులో కావడం విశేషం. ఈ వార్త చదివి ఆ నర్స్ అయ్యో పాపం అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : 3 People Dont Need Passport : పాస్ పోర్ట్ లేకుండా ప్రపంచం చుట్టేసే ఆ ముగ్గురు ?