3 People Dont Need Passport : పాస్ పోర్ట్ లేకుండా ప్రపంచం చుట్టేసే ఆ ముగ్గురు ?
3 People Dont Need Passport : పాస్‌పోర్ట్ లేకుండా ఎక్కడికైనా వెళ్లగలిగే వారు ప్రపంచంలో ముగ్గురు ఉన్నారు..
- By Pasha Published Date - 03:23 PM, Mon - 10 July 23

3 People Dont Need Passport : పాస్‌పోర్ట్ లేకుండా ఎక్కడికైనా వెళ్లగలిగే వారు ప్రపంచంలో ముగ్గురు ఉన్నారు..
ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో తెలుసా ?
ఎవరైనా ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా కావాల్సింది పాస్‌పోర్ట్. ఏ దేశంలోని అతిపెద్ద వీఐపీ అయినా సరే.. మరో దేశానికి వెళ్లేటప్పుడు పాస్‌పోర్టును వెంట తీసుకెళ్లాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా ముగ్గురికి మాత్రం పాస్‌పోర్ట్ నుంచి మినహాయింపు(3 People Dont Need Passport) ఉంటుంది. వారు పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా వెళ్లొచ్చు. అవును, ఈ ముగ్గురు వ్యక్తులు ఏ దేశానికి వెళ్లడానికీ పాస్‌పోర్ట్ అవసరం లేదు. అది ఎవరనేది పెద్ద ప్రశ్న.
ఆ ముగ్గురు ఎవరంటే..
ఆ ముగ్గురు వ్యక్తుల లిస్టులో బ్రిటన్ రాజు, జపాన్ రాజు, జపాన్ రాణి ఉన్నారు. విదేశాలకు వెళ్లేందుకు వీరికి పాస్‌పోర్టు అవసరం లేదు. బ్రిటన్ రాజ కుటుంబంలో క్వీన్ ఎలిజబెత్ ఉన్నంత కాలం ఆమెకు కూడా ఈ హక్కు ఉండేది. ఇప్పుడు ఆ హక్కు బ్రిటన్ రాజు చార్లెస్ కు బదిలీ అయ్యింది. అయితే ఆయన కుటుంబంలోని ఎవరైనా విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ తప్పక అవసరం.
Also read : BJP leaders security: కేంద్రం కీలక నిర్ణయం..ఈటలకు ‘వై ప్లస్’, అర్వింద్‌కు ‘వై’ కేటగిరీ భద్రత
అది ఏ పాస్‌పోర్ట్ ?
ఏదైనా దేశంలోని ముఖ్యమైన వ్యక్తులకు కూడా పాస్‌పోర్ట్ అవసరం. కానీ వారికి దౌత్యపరమైన పాస్‌పోర్ట్ ఉంటుంది. ఇది వారికి ఏ దేశంలోనైనా ప్రత్యేక హోదాను ఇస్తుంది. విమానాశ్రయంలో వారికి ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. దౌత్య పాస్‌పోర్ట్ దేశంలోని కొంతమంది ప్రత్యేక వ్యక్తుల వద్ద మాత్రమే ఉంటుంది. అలాంటి వారికి ప్రత్యేక ప్రోటోకాల్ కూడా ఉంటుంది. బ్రిటీష్ రాజకుటుంబంలో కొంతమందికి ఇలాంటి దౌత్య పాస్‌పోర్ట్ లు ఉన్నాయి.
మన దేశంలో మెరూన్ రంగు పాస్‌పోర్ట్.. వైట్ కలర్ పాస్‌పోర్ట్
మన దేశంలో దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులకు మెరూన్ రంగు పాస్‌పోర్ట్ జారీ చేస్తుంటారు. ఈ పాస్‌పోర్ట్ ఉంటే విదేశాలకు వెళ్లేందుకు వీసా అవసరం లేదు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభంగా ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ కు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మళ్లీ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ పని కోసం విదేశాలకు వెళ్ళే వ్యక్తికి వైట్ కలర్ పాస్‌పోర్ట్ ఇస్తుంటారు. ఈ పాస్‌పోర్ట్‌పై ప్రత్యేకాధికారాలు ఉన్నాయి. ఈ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు ప్రభుత్వ అధికారి అని అర్థం చేసుకోవచ్చు.