PM Modi : కశ్మీర్‌లోయలో వందేభారత్..వచ్చే నెలలో ప్రారంభం ?
అతేకాక..కట్రాలో బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారని సమాచారం. వాటితోపాటు జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన ను సందర్శించనున్నారని సమాచారం.
- Author : Latha Suma
Date : 27-03-2025 - 1:10 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi: తొలిసారి కశ్మీర్‌లోయ వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు ప్రధాని మోడీ ఏప్రిల్ 19న కట్రా-శ్రీనగర్ మధ్య ప్రత్యేక వందే భారత్ రైల్వే సర్వీసును ప్రారంభించనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక ఈ రైలు కట్రా నుంచి శ్రీనగర్‌ల మధ్య నడవనుందని, జమ్ము రైల్వేస్టేషన్ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత అక్కడినుంచి శ్రీనగర్‌కు దాని సేవలు విస్తరిస్తారని తెలుస్తోంది. అతేకాక..కట్రాలో బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారని సమాచారం. వాటితోపాటు జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన ను సందర్శించనున్నారని సమాచారం.
Read Also: Amit Shah : త్వరలోనే ఉబర్, ఓలాలకు పోటీగా ప్రభుత్వ ‘సహకార్ టాక్సీ’ : అమిత్ షా
కాగా, ఇటీవల కట్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వేస్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు వందేభారత్ రైలు ప్రయాణించింది. కశ్మీర్ లోయలోని అతిశీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. నీరు గడ్డ కట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ మార్గమధ్యంలో చీనాబ్ నది పై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్‌పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చీనాబ్ వంతెనపై తొలిసారి వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. ఈ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు ట్రయల్ రన్‌ను భారత రైల్వే నిర్వహించింది.