Training program : కూటమి ఎమ్మెల్యేలకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం
Training program : బడ్జెట్ పై అవగాహన, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు.
- By Latha Suma Published Date - 02:12 PM, Tue - 12 November 24

Alliance MLAs : ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేకు ఈరోజు(మంగళవారం) నుండి శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నూతనగా ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలు సభలో ఎలా నడుచుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబు శిక్షణ ఇప్పించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు.
అనంతరకం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. సభలో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరును ఎమ్మెల్యేలకు వివరించినట్లు తెలిపారు. ఇకపోతే సీఎం చంద్రబాబు శాసనసభ్యలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ పై అవగాహన, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇకపై కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
కాగా, ఏపీ అసెంబ్లీకి జరిగి ఎన్నికల్లో కూటమి పార్టీ నుంచి అనేకమంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బుధవారానికి సభను వాయిదా వేశారు. ఇందులో భాగంగా నేడు సీఎం చంద్రబాబు నాయుడు కొత్తగా ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేల కు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు.