Telangana Cabinet : ఆగస్టు 1న తెలంగాణ క్యాబినెట్ భేటి
సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుండి 13 వరకు అమెరాకి పర్యటనకు వెళ్లనున్నారు. అందుకే 1ని మంత్రివర్గ సమావేశం నిర్వహించాలిని ప్రభుత్వం నిర్ణయించింది.
- By Latha Suma Published Date - 02:32 PM, Mon - 29 July 24

Telangana Cabinet: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మాట్లాడుతూ..ఆగస్టు 1న మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం(Telangana cabinet meeting) జరుగుతుందని తెలిపారు. గతంలో ఆగస్టు 01న సాయంత్రం 4.30 గంటలకు ఉంటుందని నిర్ణయించాం. కానీ మధ్యాహ్నం 2.30 గంటలకే కేబినెట్ సమావేశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పలు విషయాలపై చర్చించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, తెలంగాణకు జరిగిన అన్యాయంపై, పాలమూరు వలసలపై ఆనాడు నేను అసెంబ్లీలో మాట్లాడాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పై నేను అసెంబ్లీలో ఎంత మాట్లాడానో.. కేసీఆర్ పార్లమెంట్ లో ఎంత మాట్లాడారో రికార్డులు తీయండి. ఇతరుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చింది వీళ్లు.. జర్నలిస్ట్ పై కేసు పెట్టామని చెబుతున్న వీళ్లు… వారి పాలనలో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి ఆమె చానల్ ను గుంజుకున్నారు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ పై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఆడబిడ్డలను జైల్లో పెట్టినందుకే ఇప్పుడు ఆ పాపం అనుభవిస్తున్నారు. ఆనాడు నన్ను జైల్లో పెట్టినా నేను భయపడలేదు. అబద్దాలు చెబితే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు. విద్యుత్ పై మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆగస్టు 1, 2న బీఆరెస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్దం. మీరెంత అబద్ధాలు చెబితే నేను అంత నిజాలు చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇకపోతే..ఆగస్ట్ 2న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. అయితే, అసెంబ్లీ సమావేశాల ముగింపునకు ఒక్క రోజు ముందే తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుండటం ఆసక్తిగా మారింది. ఈ భేటీకి సంబంధించిన అజెండా ఏంటన్నది తెలియనప్పటికీ.. జాబ్ క్యాలెండర్, రైతు భరోసా గైడ్ లైన్స్‌కు సంబంధించిన టాపిక్స్‌పై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు సమాచారం.
Read Also: Olympic Games Paris 2024 : నిరాశపరిచిన రమితా జిందాల్