HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Relief For The Middle Class People The Center Is Planning To Reduce Gst This Is The List Of Items Whose Rates Will Be Reduced

GST : మధ్యతరగతి ప్రజలకు ఊరట..జీఎస్టీ తగ్గింపు యోచనలో కేంద్రం..రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!

దీంతో సామాన్య ప్రజానికానికి రోజువారీ ఖర్చుల్లో కొంత తలనొప్పి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం, లేదా ఈ శ్లాబులో ఉన్న కొన్ని కీలక నిత్యావసర వస్తువులను 5 శాతం పన్ను శ్లాబులోకి తరలించడం వంటి ప్రతిపాదనలను కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది.

  • By Latha Suma Published Date - 01:02 PM, Wed - 2 July 25
  • daily-hunt
Relief for the middle class people.. The Center is planning to reduce GST.. This is the list of items whose rates will be reduced..!
Relief for the middle class people.. The Center is planning to reduce GST.. This is the list of items whose rates will be reduced..!

GST  : వేతన జీవులకు ఆదాయపన్ను రాయితీల రూపంలో కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మధ్యతరగతి, పేద ప్రజలకు మరో బంపర్ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువులపై ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని తగ్గించేందుకు చర్యలు ప్రారంభించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో సామాన్య ప్రజానికానికి రోజువారీ ఖర్చుల్లో కొంత తలనొప్పి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం, లేదా ఈ శ్లాబులో ఉన్న కొన్ని కీలక నిత్యావసర వస్తువులను 5 శాతం పన్ను శ్లాబులోకి తరలించడం వంటి ప్రతిపాదనలను కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ మార్పులు అమలయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలాంటి చర్యల వల్ల కేంద్ర ఖజానాపై రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా వేయబడింది.

Read Also: Delhi : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు.. నిందితులకు బెయిల్

దీని వల్ల తక్షణంగా ప్రభుత్వ ఆదాయానికి కొంత దెబ్బ తగిలినా, వినియోగదారులపై పన్ను భారం తగ్గడం వల్ల కొనుగోళ్లు పెరగవచ్చని, దీర్ఘకాలంలో వసూళ్ల పెరుగుదల దిశగా ఇది నడిపించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జీఎస్టీ రేట్లను సవ్యంగా హేతుబద్ధీకరించాలన్న సూచనలు చేశారు. ఇది కూడా ఈ నిర్ణయానికి పరోక్షంగా సంకేతమని భావిస్తున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు అమలయ్యే పక్షంలో టూత్‌పేస్ట్, కుక్కర్లు, గీజర్లు, సైకిళ్లు, రూ. 1000 పైబడిన రెడీమేడ్ దుస్తులు, రూ. 500 నుంచి రూ. 1000 మధ్య ధర కలిగిన షూస్‌ వంటి అనేక ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది నేరుగా సామాన్య ప్రజలకు ప్రయోజనకరం. దినసరి వినియోగ వస్తువుల ధరలు తగ్గడం ద్వారా కుటుంబ ఖర్చుల్లో కొంత ఉపశమనం కలుగుతుంది.

అయితే, జీఎస్టీ శ్లాబులపై మార్పులకు పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తోందని సమాచారం. ఈ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్రాలు భావిస్తున్నాయి. జీఎస్టీకి సంబంధించిన ఏ మార్పైనా అమలులోకి రావాలంటే జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఈ నెలాఖరులో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే, ఈ పన్ను తగ్గింపుతో కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలకు మళ్లీ కేంద్రం శుభవార్త అందించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో ధరలు నియంత్రణలోకి రావడమే కాకుండా, వినియోగం పెరగడం ద్వారా దేశీయ ఉత్పత్తి రంగానికి కూడా ఊతమిచ్చే మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

కేంద్రం తెస్తున్న జీఎస్టీ పన్ను మార్పులతో తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..

.టూత్ పేస్ట్
.టూత్ పౌడర్
.గొడుగులు
.కుట్టు మిషన్లు
.ప్రెషర్ కుక్కర్లు
.వంట సామాగ్రి
.ఎలక్ట్రిక్ గీజర్లు
.ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు
.చిన్న వాషింగ్ మెషిన్లు
.సైకిళ్లు
.రెడీమేడ్ దుస్తులు
.ఫుట్ వేర్
.స్టేషనరీ వస్తువులు
.వ్యాక్సిన్స్
.సిరామిక్ టైల్స్
.వ్యవసాయ ఉపకరణాలు

Read Also: Separate Bill : మగవారికోసం పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు పెట్టాల్సిందే – శేఖర్ భాషా

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • essential commodities
  • finance minister nirmala sitharaman
  • Goods and Services Tax
  • GST Council
  • GST reduction
  • price reduction
  • tax slab

Related News

Military Equipment

Military Equipment: కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఆయుధాలు, సైనిక విమానాలపై జీఎస్టీ రద్దు!

సాఫ్ట్‌వేర్‌తో నడిచే రేడియో కమ్యూనికేషన్ పరికరాలపై గతంలో 18-28 శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దానిని కేవలం 5 శాతానికి తగ్గించారు. అలాగే వాకీ-టాకీ ట్యాంకులు, ఆర్మర్డ్ వెహికిల్స్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

  • Why the eight-year delay? ..Chidambaram's response on the Centre's reduction in GST rates..

    Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..

  • As Soaps, Noodles, Shampoo

    GST 2.0 : ధరలు తగ్గే వస్తువులివే..!!

  • GST Rates

    GST Council : సంచలన నిర్ణయం.. వాటిపై జీఎస్టీ రద్దు

  • Good news for the common man: Prices of 175 items to be reduced

    GST Council : సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్: తగ్గనున్న 175 వస్తువుల ధరలు

Latest News

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd