HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Prime Minister Modi Visit To Visakhapatnam Finalized

PM Modi : విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు

జూన్ 20వ తేదీ సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నేరుగా విశాఖ చేరుకుంటారు. అనంతరం తూర్పు నౌకాదళం అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. తరువాతి రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై 7:45 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ భారీ ఈవెంట్‌కు విజయవంతంగా నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు.

  • Author : Latha Suma Date : 16-06-2025 - 3:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prime Minister Modi visit to Visakhapatnam finalized
Prime Minister Modi visit to Visakhapatnam finalized

PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 21న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సాగరతీరంలో నిర్వహించనున్న విశాల యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా ప్రకటించబడింది. జూన్ 20వ తేదీ సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నేరుగా విశాఖ చేరుకుంటారు. అనంతరం తూర్పు నౌకాదళం అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. తరువాతి రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై 7:45 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ భారీ ఈవెంట్‌కు విజయవంతంగా నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు.

Read Also: Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ ముఖ్య సమాచారం

ఈ కార్యక్రమానికి సుమారు ఐదు లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశముంది. ఇందులో విద్యార్థులు, యువత, సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. భౌగోళిక పరిమితులకు అనుగుణంగా ప్రతి వెయ్యి మందికి ఒక ‘యోగా బ్లాక్’ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బ్లాక్‌కు ప్రత్యేకంగా ఒక యోగా శిక్షకుని నియమించడంతోపాటు, అవసరమైన యోగా మ్యాట్స్‌, ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య బృందాల సాయాన్ని కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా సంస్థల సమన్వయంతో శిక్షణా కార్యక్రమాలు, వాలంటీర్ల నియామకాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విశాఖలోని అనేక ప్రదేశాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. యోగా శిక్షకులు, వాలంటీర్లు ప్రజలకు సూచనలు, మార్గదర్శకాలను అందిస్తున్నారు.

యోగా కార్యక్రమం ముగిసిన అనంతరం అదే రోజు ఉదయం 11:50 గంటలకు ప్రధాని మోడీ విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. పూర్తిగా భద్రతా పరిరక్షణల నడుమ ఈ పర్యటన సాగనుంది. విశాఖ నగర వ్యాప్తంగా ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, భద్రతా సన్నాహాలు ప్రారంభమయ్యాయి. యోగా దినోత్సవాన్ని జాతీయ స్థాయిలో విశాఖ నుంచే జరిపించడం గర్వకారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పర్యటన ద్వారా విశాఖపట్నానికి అంతర్జాతీయ దృష్టి సారించనుందని, ఇక్కడి పర్యాటక, ఆరోగ్య సంబందిత రంగాలకు ఇది పెద్ద ప్రోత్సాహం కలిగించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

Read Also: Cyprus : ప్రధాని మోడీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eastern Naval Guest House
  • international yoga day
  • pm modi
  • Visakhapatnam
  • Visakhapatnam Beach
  • yoga program

Related News

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd