HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Cyprus Confers Highest Award On Pm Modi

Cyprus : ప్రధాని మోడీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ 3’ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకుంటూ మోడీ మాట్లాడారు. ఈ పురస్కారం 140 కోట్ల భారతీయుల తరపున వచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. సైప్రస్ ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు.

  • Author : Latha Suma Date : 16-06-2025 - 3:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cyprus confers highest award on PM Modi
Cyprus confers highest award on PM Modi

Cyprus: ప్రస్తుతం మూడు దేశాల విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆదివారం సాయంత్రం ద్వీపదేశమైన సైప్రస్‌ చేరుకున్నారు. లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్‌ స్వయంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. ఇది రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి సైప్రస్‌ గడ్డపై అడుగుపెడుతున్న అరుదైన సందర్భం కావడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ 3’ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకుంటూ మోడీ మాట్లాడారు. ఈ పురస్కారం 140 కోట్ల భారతీయుల తరపున వచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. సైప్రస్ ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు.

Read Also: SBI FD rates : ఎస్‌బీఐ ఎఫ్‌డీ రేట్లలో కోత.. తాజా వడ్డీ రేట్ల వివరాలు ఇవీ..

ఈ పురస్కారం రెండు దేశాల మధ్య ఉన్న మైత్రి, శాంతియుత సహజీవనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఇది వసుధైవ కుటుంబకం భావనకు, భారత-సైప్రస్ మధ్య ఉన్న మానవీయ బంధానికి ప్రతిరూపం. ఈ అవార్డును ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితంగా అర్పిస్తున్నాను అని పేర్కొన్నారు. భారత్ మరియు సైప్రస్ సంబంధాలు గత కొన్ని దశాబ్దాల్లో స్థిరంగా ముందుకు సాగుతున్నాయని, అయితే ఈ పర్యటన ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత తదితర రంగాల్లో మరింత సన్నిహిత సహకారానికి మార్గం సుగమమవుతుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఇరుదేశాలు తమ దేశాల అభివృద్ధి ప్రయాణంలో సహయాత్రికులుగా మారుతాయి. ప్రపంచంలో శాంతి, భద్రత, భౌగోళిక సమగ్రత కోసం కలిసి పనిచేస్తాయి అని అన్నారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల మంత్రిత్వ శాఖల మధ్య పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సమాచారం. భారత్ నుండి సైప్రస్‌కి విద్యార్ధులు, వృత్తి నిపుణుల వలసలు, ద్వైపాక్షిక పెట్టుబడుల విస్తరణ వంటి అంశాలు చర్చకు వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. మోదీ తన మూడు దేశాల పర్యటనలో మొదటి దశగా సైప్రస్‌ చేరగా, అక్కడి నుంచి ఆయన కెనడా ప్రయాణించనున్నారు. అక్కడ జరిగే జీ7 సదస్సులో అతిథి నాయకుడిగా పాల్గొననున్నారు. అనంతరం ఆయన క్రొయేషియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పరంగా చారిత్రాత్మకంగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Matangeshwar Temple : ఏటా పెరుగుతున్న శివలింగం..ఎక్కడుందా ఆలయం? విశేషాలేంటి? తెలుసుకుందాం!

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cyprus
  • Cyprus highest award
  • G7 conference
  • Grand Cross of the Order of Makarios 3
  • pm modi

Related News

Iran-Israel War

ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

ఎఫ్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బంకిమ్ భారతి, ప్రధాన కార్యదర్శి మనోజ్ యాదవ్ ప్రధాని మోదీకి ఒక విన్నపం చేశారు.

  • T20 World Cup 2026

    ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌?

Latest News

  • Fire Accident : SCB మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

  • పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

  • టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్

  • శుభమన్ గిల్, హర్షిత్ రాణాకు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!

  • Gas Cylinder Booking : గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇలా చేయండి..

Trending News

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd