Pakistan : ప్రతీకార చర్యలకు దిగిన పాక్.. భారత నౌకలపై నిషేధం
పాక్ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. "న్యూఢిల్లీతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది తాత్కాలికం కాదు. భారత్ తమ వైఖరిని మారించేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉంది" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
- Author : Latha Suma
Date : 04-05-2025 - 3:24 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకుగాను పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతులు చేపట్టడాన్ని భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ తాజాగా ప్రతీకార చర్యలకు దిగింది. భారత జెండా ఉన్న వాణిజ్య నౌకలు తమ దేశపు ఓడరేవులను ఇకపై ఉపయోగించుకోలేవని పాక్ స్పష్టం చేసింది.
Read Also: Road accident : మానవత్వం చాటుకున్న హరీశ్ రావు..జనాల ప్రశంసలు
పాక్ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. “న్యూఢిల్లీతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది తాత్కాలికం కాదు. భారత్ తమ వైఖరిని మారించేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉంది” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాదు, భారత్ నుంచి దిగుమతి అయ్యే పలు ప్రధాన వస్తువులపై కూడా పాక్ బ్యాన్ విధించినట్లు వెల్లడించింది.
పాక్ తీసుకున్న ఈ చర్యలతో వాణిజ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వ్యాపార పరంగా అనేక పరిమితులు ఉన్నాయి. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (MFN) హోదాను తొలగించింది. ఆ వెంటనే పాక్ నుంచి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచింది. తాజాగా భారత్ పరోక్షంగా ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాక్ నుంచి అన్ని రకాల దిగుమతులను నిలిపివేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ ఆంక్షలు విధించడం గమనార్హం. పాక్ నౌకలు కూడా ఇకపై భారత రేవుల్లోకి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు దేశాల మధ్య మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్, సముద్ర మార్గాల్లో వాణిజ్యం ఇకపై నిలిచిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక, పై భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై పాక్ వ్యతిరేకంగా మరింత దూకుడుగా వ్యూహాలు రచించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవాలన్న భారత్ సంకల్పం ఈ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు.
Read Also: Indian Army: లోయలో పడిన మరో ఆర్మీ వాహనం.. మృత్యులోయల డేంజర్ బెల్స్