Trending
-
NCW : కృష్ణంరాజు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్
కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి కఠినమైన లేఖ రాశారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు మహిళల పరువును తక్కువ చేస్తాయని, అవి పూర్తి స్థాయిలో అసభ్యంగా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది.
Date : 10-06-2025 - 1:02 IST -
Yoga Day : ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా : చిరంజీవి
సోషల్ మీడియా వేదికగా "ఎక్స్" లో పోస్ట్ చేస్తూ చిరంజీవి స్పందించారు. ఫోకస్ వల్ల ఫిట్‌నెస్ పెరుగుతుంది. యోగా చేస్తే ఈ రెండూ వస్తాయి. యెగా డేను సెలబ్రేట్ చేసుకుందాం. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. ఇది సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందరూ కలిసి #IDY2025 ని ఘనంగా జరుపుదాం అని ఆయన పేర్కొన్నారు.
Date : 10-06-2025 - 12:44 IST -
Harish Rao: హైకోర్టులో హరీశ్‌రావుకు ఊరట
వాదనలు, ఆధారాల ఆధారంగా న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. హరీశ్ రావు అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు నిరూపించేందుకు పిటిషనర్ సమర్పించిన ఆధారాలు సరిపోవని, అవి నిర్ధారణకు నొప్పేంతగా లేవని అభిప్రాయపడింది.
Date : 10-06-2025 - 12:18 IST -
Raghurama : సజ్జలపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు
మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ప్రభుత్వ పదవిలో కొనసాగడమే అన్యాయం అని, ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలకు తలవంచే అంశంగా అభివర్ణించారు. ఇప్పటికే పలు మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నాయి.
Date : 10-06-2025 - 11:56 IST -
Bala Krishna : బాలయ్యకి చంద్రబాబు, లోకేష్ స్పెషల్ విషెస్..
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా ఖాతాలో బాలకృష్ణకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. "వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను సంపాదించిన మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Date : 10-06-2025 - 11:17 IST -
ICC Hall Of Fame: ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం!
ఎంఎస్ ధోనీ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన ODI మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 2007లో ధోనీకి టీమ్ ఇండియా కెప్టెన్సీ లభించింది.
Date : 09-06-2025 - 10:29 IST -
Rahul Gandhi : నరేంద్ర మోడీ పాలనలో మార్పు లేదు.. కేవలం ప్రచారమే: రాహుల్ గాంధీ
మహారాష్ట్ర ఠానే జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రాహుల్ గాంధీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందిస్తూ, మోడీ సర్కార్ పాలనలో విఫలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నిత్యం ఎదురవుతున్న బీభత్స ఘటనలు ప్రజల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Date : 09-06-2025 - 6:27 IST -
AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా విడుదల చేసిన ఈ నిధులను ఉపాధి హామీ పనులకు వినియోగించనుంది. ఈ నిధులను సంబంధిత నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌కు అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 09-06-2025 - 5:48 IST -
Nara Lokesh : వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు?: మంత్రి లోకేశ్
మహిళలపై వైసీపీ నేతల దుర్భాషలు, అవమానకర వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన లోకేశ్, వైసీపీ నేతలకు మహిళల పట్ల గౌరవం లేదని, వారిని తక్కువగా చూస్తున్న తీరు హేయం అని వ్యాఖ్యానించారు. వారు తల్లి, చెల్లిని గౌరవించని వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటున్నారని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Date : 09-06-2025 - 5:38 IST -
Amit Shah : 11 ఏళ్ల మోడీ పాలన స్వర్ణయుగం లాంటిది : అమిత్ షా
మోడీ మూడో హయాంలో దేశం అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం దేశ అభివృద్ధికి ప్రధాన ఆస్తిగా మారిందని చెప్పారు. ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వెల్లడించిన అమిత్ షా, ప్రధాని మోడీ నేతృత్వంలోని గత 11 సంవత్సరాల పాలనను “స్వర్ణయుగం”గా వర్ణించారు.
Date : 09-06-2025 - 5:15 IST -
Bhatti Vikramarka : మహిళల ఉచిత ప్రయాణానికి రూ.182 కోట్లు జీరో టికెట్లు: భట్టి విక్రమార్క
కానీ నిజానికి ప్రభుత్వం ఆర్టీసీకి పూర్తి పరిహారం చెల్లిస్తోంది. ఇప్పటివరకు రూ.6,088 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించింది. దీంతో ఆర్టీసీ కార్యకలాపాలు గాడిలో పడుతున్నాయి అని తెలిపారు.
Date : 09-06-2025 - 4:49 IST -
CM Chandrababu : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈలు, సేవారంగానికి పెద్దపీట: సీఎం చంద్రబాబు
సచివాలయం నుంచి వర్చువల్‌గా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం సేవారంగం ద్వారా రాష్ట్రానికి కేవలం 6.3 శాతం ఆదాయం మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ రంగాన్ని విస్తరించడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చన్నారు.
Date : 09-06-2025 - 4:04 IST -
RCB : బెంగళూరు తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ
ఈ ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో RCB యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) సహా పలువురు నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Date : 09-06-2025 - 3:31 IST -
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్‌పాస్ ఛార్జీల పెంపు..నేటి నుంచే అమలు
నేటి నుంచి కొత్త ధరలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. పెరిగిన ఛార్జీలు సామాన్య ప్రజలపై భారం మోపేలా ఉన్నాయి. ఆర్టీసీ ప్రకటన మేరకు, బస్ పాస్ ఛార్జీలు సగటున 20 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఇప్పటివరకు రూ.1,150కి లభించిన ఆర్డినరీ పాస్‌ను ఇప్పుడు రూ.1,400కి పెంచారు. అదే విధంగా, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ధరను రూ.1,300 నుండి రూ.1,600కి మార్చారు.
Date : 09-06-2025 - 2:58 IST -
CM Revanth Reddy : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..శాఖల కేటాయింపుపై చర్చ..!
మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణ, కీలక శాఖల బదిలీల అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కీలక శాఖలు ముఖ్యంగా ఆర్థిక శాఖ, పౌర సరఫరాల శాఖల మార్పు చాలా కీలకంగా మారాయి.
Date : 09-06-2025 - 1:17 IST -
Padi kaushik Reddy : పాడి కౌశిక్‌రెడ్డిపై కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
ఈ కేసు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో కౌశిక్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ‘‘నన్ను గెలిపించకపోతే కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకుంటా’’ అని ఆయన చెప్పిన వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Date : 09-06-2025 - 12:46 IST -
Phone Tapping Case : సిట్ విచారణకు హాజరైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు
ఈ కేసు దర్యాప్తులో ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి అధికారులు అరెస్టు కాగా, ప్రభాకర్‌రావు పరారీలో ఉన్నారు. కేసు నమోదు అయిన వెంటనే ఆయన అమెరికా వెళ్లిపోయారు. దాంతో ఆయన తిరిగి రాకుండా ఉండేందుకు పోలీసులు కేంద్రానికి నివేదిక ఇచ్చి ఆయన పాస్‌పోర్టును రద్దు చేయించారు.
Date : 09-06-2025 - 12:17 IST -
AP: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు !
రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకోబడింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేయబడ్డాయని సమాచారం.
Date : 09-06-2025 - 11:37 IST -
Kaleshwaram Commission : రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాయొద్దు : హరీశ్‌రావు
ఈరోజు ఉదయం 11 గంటలకు హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. విచారణకు ముందు ఆయన తెలంగాణ భవన్‌లో పార్టీ కీలక నేతలతో సమావేశమై వ్యూహాత్మకంగా చర్చలు జరిపారు. విచారణ సందర్భంగా కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సమగ్రమైన సమాచారం ఆధారంగా సమాధానమిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Date : 09-06-2025 - 11:14 IST -
Venkaiah Naidu : ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం: వెంకయ్యనాయుడు
ఇది అతి గొప్ప త్యాగం. అలాంటి వారిపై బూతులు పెట్టడం దారుణం అని నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. "రైతులపై విమర్శలు చేయడం కేవలం అపహాస్యం కాదు, వారు చేసిన త్యాగాలను అవమానించడమే అని అన్నారు.
Date : 09-06-2025 - 10:21 IST