HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >My Goal Is To Create Wealth In Every Sector Cm Chandrababu

Tourism Conclave Program : ప్రతి రంగంలో సంపద సృష్టించాలనేదే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాబా రామ్‌దేవ్ పాల్గొనడం గర్వకారణమన్నారు. బాబా రామ్‌దేవ్ సమాజానికి చేసిన సేవ అపూర్వం. ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారుగా నియమించాలని కోరాం అని తెలిపారు. పర్యాటక రంగం రాష్ట్రాభివృద్ధికి కీలకమని సీఎం స్పష్టం చేశారు.

  • By Latha Suma Published Date - 02:37 PM, Fri - 27 June 25
  • daily-hunt
My goal is to create wealth in every sector: CM Chandrababu
My goal is to create wealth in every sector: CM Chandrababu

Tourism Conclave Program : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలో జరిగిన టూరిజం కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ..ఈ విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అభినందించారని చెప్పారు. యోగా అనేది భారతీయ సంస్కృతికి ప్రతీక. ఇది దేశాన్ని గర్వపడేలా చేసే కార్యక్రమం. మన ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Teamindia Captain: గిల్‌కు బిగ్ షాక్‌.. టీమిండియా వ‌న్డే కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌?

ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాబా రామ్‌దేవ్ పాల్గొనడం గర్వకారణమన్నారు. బాబా రామ్‌దేవ్ సమాజానికి చేసిన సేవ అపూర్వం. ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారుగా నియమించాలని కోరాం అని తెలిపారు. పర్యాటక రంగం రాష్ట్రాభివృద్ధికి కీలకమని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తు పర్యాటక రంగానిదే. టెంపుల్ టూరిజంతో పాటు, నదీ తీర ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, పర్వత శ్రేణులు ఇవన్నీ మనకు అభివృద్ధి అవకాశాలను ఇస్తున్నాయి. పాపికొండలు, కోనసీమ, హార్సిలీ హిల్స్ వంటి ప్రాంతాలను ప్రపంచ పటంలో నిలబెట్టేలా పనిచేస్తున్నాం అని చెప్పారు.

మదనపల్లెను దేశంలోనే ప్రఖ్యాతి చెందిన వెల్‌నెస్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. యోగా, ధ్యానం (మెడిటేషన్) వంటివి మన జీవన శైలిలో గేమ్‌చేంజర్ అవుతాయి. ఆరోగ్య జీవనం కోసం వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రతి రంగంలో సంపద సృష్టించాలన్నదే నా దృష్టికోణం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన తొలి ప్రభుత్వం మనదే. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని కోరుకుంటున్నా. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు భారతీయులలో 35 శాతం వున్నారని, వారు ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని గర్వంగా చెప్పగలను అని చంద్రబాబు పేర్కొన్నారు.

బిల్ గేట్స్‌తో గతంలో జరిగిన చర్చలు, హైదరాబాద్‌లో ఐటీ కేంద్రాల ఏర్పాటుకు ఆయన చూపిన మార్గదర్శనం గురించి గుర్తు చేసుకున్నారు. భారత ఐటీ విప్లవానికి పీవీ నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలతో బీజం వేశారు. ఆ మార్గాన్ని మనం కొనసాగించాలి అన్నారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని యువత భయపడుతున్నారు. కానీ స్మార్ట్ వర్క్‌, నైపుణ్యం పెంచుకోవడమే పరిష్కారం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందడుగు వేయాలి. ప్రజలే మన గొప్ప సంపద. సరైన ప్రణాళికతో పనిచేస్తే పేదలను కూడా అభివృద్ధి దిశగా నడిపించవచ్చు అని పేర్కొన్నారు. అలాగే, ఆగస్టు 15లోగా అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేనున్నట్టు సీఎం తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం అని, అందరం కలసి పనిచేయాలన్నది ఆయన సందేశం.

Read Also: Prashant Kishor : బీహార్ పాలిటిక్స్.. రాహుల్‌గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Tourism Development
  • CM Chandrababu
  • Tourism Advisor
  • Tourism Conclave Program
  • vijayawada

Related News

YS Jagan

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

  • CM Chandrababu

    Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. మ‌రో హామీ అమ‌లు!

  • Vijayawada-Bengaluru flight narrowly misses major danger

    Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం

Latest News

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd