HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Everyone Should Condemn Sexual Violence Against Children Cm Revanth Reddy

CM Revanth Reddy : చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలి : సీఎం రేవంత్‌రెడ్డి

మన పిల్లలు, మన భవిష్యత్తు. వారికి ఎలాంటి భయమూ లేకుండా వృద్ధి చెందేలా చేయడం ప్రభుత్వ ధర్మం అని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై జరుగుతున్న సదస్సులో సీఎం రేవంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

  • Author : Latha Suma Date : 05-07-2025 - 1:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy : రాష్ట్రంలో చిన్నారులు, మహిళల భద్రతపై తమ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. లైంగిక దాడుల బాధితులకు భరోసా కేంద్రాల ద్వారా మానసిక, న్యాయ, వైద్య సహాయాన్ని అందిస్తున్నామని ఆయన వివరించారు. మన పిల్లలు, మన భవిష్యత్తు. వారికి ఎలాంటి భయమూ లేకుండా వృద్ధి చెందేలా చేయడం ప్రభుత్వ ధర్మం అని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై జరుగుతున్న సదస్సులో సీఎం రేవంత్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక హింస దేశం అంతటా ఒక తీవ్రమైన సమస్యగా మారిందన్నారు. ఇటువంటి ఘటనలను సమాజమంతా తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

Read Also: Dalai Lama : ఇంకో 30-40 ఏళ్లు జీవించాలని నా ఆకాంక్ష : దలైలామా

చిన్నారులపై హింసకు పాల్పడే దోషులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించిన సీఎం ఇలాంటి ఘటనలపై ప్రభుత్వ చర్యలు తీవ్రంగా ఉంటాయి. న్యాయవ్యవస్థతో సమన్వయంగా నిందితులకు కఠిన శిక్షలు విధించేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని స్పష్టం చేశారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర డీజీపీ జితేందర్‌, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. న్యాయ, పోలీసు వ్యవస్థల మధ్య సమన్వయంతోనే బాధితులకు సమర్ధవంతమైన రక్షణ, న్యాయం సాధ్యమవుతుందన్నది నాయకుల అభిప్రాయం. చిన్నారుల భద్రతలో సామాజిక మాధ్యమాల ప్రాధాన్యం గణనీయమైందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషియల్‌ మీడియా వల్ల పలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పిల్లలు ఏం చూస్తున్నారో, ఎవరిద్వారా ప్రభావితమవుతున్నారు అనే విషయాల్లో జాగ్రత్త అవసరం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో భరోసా కేంద్రాలు మహిళలు, బాలికలకు ఆపన్నహస్తంగా నిలుస్తున్నాయని సీఎం వివరించారు. పోలీస్, వైద్య, సైకాలజికల్ సపోర్ట్‌ను ఒకేచోట అందించే ఈ కేంద్రాల ద్వారా బాధితులు న్యాయం పొందే అవకాశాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. భవిష్యత్‌లో ఈ కేంద్రాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సు ముగింపులో సీఎం చిన్నారులు భయపడే సమాజం మన లక్ష్యముకాదు. వారికి సురక్షితమైన భవిష్యత్తును అందించడమే మన కర్తవ్యం అంటూ సభను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు.

Read Also: Kamal Haasan : కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • sexual violence
  • Sexual violence against children

Related News

    Latest News

    • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

    • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

    • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

    Trending News

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd