Liquor తెలంగాణలో కొత్త బీర్లు..? ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం – బిఆర్ఎస్
గతంలో సోమ్ డిస్టిలరీస్స్ కంపెనీ కారణంగా మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారు. తాజాగా తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది
- By Sudheer Published Date - 07:40 AM, Tue - 28 May 24

తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు ఏ రేంజ్లో జరుగుతాయో తెలియంది కాదు..తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎంత పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు నడిపిస్తుందంటే దానికి లిక్కర్ అమ్మకాలు అని చెప్పొచ్చు. లిక్కర్ ద్వారా కొన్ని వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుండడంతో ఈరోజు రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేయడం , సంక్షేమ పథకాలు అందజేయడం చేస్తుంది. ముఖ్యంగా బీర్ల అమ్మకాలు అనేవి ఎక్కువగా జరుగుతుంటుంది. ఈసారి ఏకంగా బీర్ల కొరత ఏర్పడడం తో ప్రభుత్వం ఫై మందు బాబు విమర్శలు , KF బీర్లు అందుబాటులో ఉంచాలంటూ లేఖలు రాసిన సందర్భాలు ఏర్పడ్డాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో తెలంగాణలో కొత్త బ్రాండ్ల బీర్లు రానున్నట్లు తెలుస్తోంది. తమ కంపెనీకి చెందిన ప్రముఖ బీర్ బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సోం డిస్టిలరీస్ అనే కంపెనీ NSEకి లేఖ రాసింది. దీంతో పవర్ 10000, హంటర్ స్ట్రాంగ్, వుడ్ పెకర్, బ్లాక్ ఫోర్ట్ బీర్లు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగై కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశ ఉందని తెలుస్తుంది. RR టాక్స్ పేరిట ఫేమస్ లిక్కర్ బ్రాండ్లకు కమీషన్లు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారనే ప్రచారం జరుగుతోంది. అడిగిన మొత్తంలో కమీషన్లు ఇవ్వట్లేదని ఫేమస్ కంపెనీల బీర్లు ఆర్డర్లు పెట్టకుండా కృత్రిమ కొరత సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కొరతను సాకుగా చూపి ఈ కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు ప్రభుత్వం స్కెచ్ గీసినట్లుగా చర్చ జరుగుతోంది. తద్వారా భారీగా కమీషన్ పొందేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసిందిని టాక్. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాష్ట్రంలో కొత్త బ్రాండ్‌ల మద్యంకు అవకాశం ఇవ్వలేదని మంత్రి జూపల్లి చెప్పారు. కానీ సోం డిస్టిలరీస్ కంపెనీ తెలంగాణలో కొత్త బీర్లు తీసుకువస్తోంది. దీనిని బట్టి మంత్రి జూపల్లి చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది’ అని విమర్శించారు. ‘సోమ్ డిస్టిలరీస్‌లో కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని కేసు నడిచింది. 2013-14లో మరో రూ.25 లక్షలు, 2019లో సోమ్ డిస్టిలరీస్ కాంగ్రెస్ పార్టీకి రూ.1.31 కోట్లు విరాళాలు ఇచ్చింది. సోమ్ డిస్టిలరీస్ కార్యక్రమానికి దిగ్విజయ్ సింగ్ వెళ్లి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్రమ మద్యానికి తలుపులు తెరిచారు. మధ్యప్రదేశ్‌లో సోమ్ డిస్టిలరీస్ సంస్థను సీజ్ చేశారు. పలుసార్లు ఆ డిస్టిలరీస్‌పై అధికారులు దాడులు జరిగాయి. కానీ సాక్షాత్తు ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాలు చెప్తున్నారు’ అని మన్నె మండిపడ్డారు. తెలంగాణలో బీర్లు అమ్మడానికి సోమ్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు? గతంలో సోమ్ డిస్టిలరీస్స్ కంపెనీ కారణంగా మధ్యప్రదేశ్‌లో 65 మంది చనిపోయారు. తాజాగా తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలి. లేకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని మన్నె ధ్వజమెత్తారు. మరి ఏంజరుగుతుందో చూద్దాం.
Read Also : NTR Jayanti : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు