HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Singer Mangli Embroiled In Another Controversy

మరో వివాదంలో సింగర్ మంగ్లీ

  • Author : Vamsi Chowdary Korata Date : 18-03-2026 - 10:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kd The Devil Singer Mangli
Kd The Devil Singer Mangli

Singer Mangli  ధ్రువ సర్జా హీరోగా నటించిన కేడీ: ది డెవిల్ చిత్రంలోని ‘సర్కే చునార్’ పాటలో అసభ్యత ఉందన్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు స్పందిస్తూ, అన్ని వేదికల నుంచి ఈ పాటను తొలగించాలని సీబీఎఫ్‌సీని ఆదేశించింది. డబుల్ మీనింగ్ లిరిక్స్, అసభ్యకర నృత్యాల వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవ్వడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ రాకుండా పర్యవేక్షించాలని సూచించింది.

కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కథానాయకుడిగా రూపొందుతున్న భారీ బడ్జెట్ కన్నడ చిత్రం ‘కేడీ: ది డెవిల్’. ఇందులో సంజయ్‌ దత్‌, శిల్పా శెట్టి, నోరా ఫతేహి, రీష్మా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఊహించని విధంగా ఇప్పుడీ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ‘సర్కే చునార్‌’ అనే పాటపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగి కీలక ఆదేశాలు ఇచ్చింది.

కేడీ: ది డెవిల్ సినిమా నుంచి ఇటీవల ‘సర్సే నిన్న సెరగా సర్సే’ అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. హిందీలో ‘సర్కే చునార్‌ తేరీ సర్కే’.. తెలుగులో ‘జరిపే నాతో పండగ జరిపే’ అనే పేర్లతో ఈ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అర్జున్ జన్యా సంగీతం సమకూర్చిన ఈ పాటకి తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించగా.. సింగర్ మంగ్లీ పాడింది. అయితే సంజయ్‌ దత్‌ – నోరా ఫతేహిలపై చిత్రీకరించిన ఈ పాటపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాంగ్ లిరిక్స్, డ్యాన్స్ మూమెంట్స్ అసభ్యంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి.

డబుల్ మీనింగ్ తో ఉన్న కేడీ: ది డెవిల్ పాట ఎలా పాడావంటూ సింగర్ మంగ్లీపై నెటిజన్లు మండిపడ్డారు. డ్యాన్స్ కంపోజ్ చేసిన రాజు సుందరం మాస్టర్ ని, లిరిక్స్ రాసిన చంద్రబోస్ ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ముఖ్యంగా హిందీ వెర్షన్ పై ఎక్కువ ట్రోలింగ్ జరిగింది. భారతీయ సంస్కృతిని కించపరిచేలా ఈ చిత్రీకరణ ఉందంటూ, ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) ఈ అంశంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. తక్షణమే పాటని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

అన్ని డిజిటల్, మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ‘కేడీ: ది డెవిల్’ పాటను వెంటనే తొలగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అధికారులను కేంద్రం ఆదేశించింది. కేవలం పాటను తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో సినిమాలు లేదా మ్యూజిక్ వీడియోల విషయంలో ఇలాంటి అసభ్యకర కంటెంట్ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. సెన్సార్ నిబంధనలను మరింత పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని సీబీఎఫ్‌సీని ఆదేశించింది.

కేడీ: ది డెవిల్ చిత్రానికి కన్నడ స్టార్ డైరెక్టర్, నటి రక్షిత భర్త ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక పీరియడ్ యాక్షన్ డ్రామా. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ దీనిని నిర్మిస్తున్నారు. 2026 ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పద పాటతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిత్ర యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • CBFC
  • central government
  • Kd The Devil
  • Sarke Chunar
  • singer mangli
  • Song Controversy
  • tollywood

Related News

Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో కీలక ప్రాజెక్టును కేటాయించింది. రాష్ట్రానికి ఎన్‌సీసీ (నేషనల్ కాడెట్ కార్ప్స్) డైరెక్టరేట్‌ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్‌సీసీ హెడ్‌క్వార్టర్స్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటన విడుదల చేసింది. ఏపీతో పాటుగా జార్ఖండ్‌కు కూడా డైరెక్టరేట్‌ను మంజూరు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 17 డైరెక్టరేట్లు ఉండగా.. తాజాగా ఏపీ, జార్ఖండ్‌

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

  • Centre's sensational decision on petrol 30% excise duty waiver.

    Fuel Price: పెట్రోల్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు

  • Alia Bhatt's action-packed mayhem... 'Alpha' teaser released.

    Alia Bhatt: ఆలియా భట్ యాక్షన్ విధ్వంసం.. ఆల్ఫా టీజర్ రిలీజ్

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd