HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ms Dhoni Goodbye To Long Hair Pics In New Hairstyle

MS Dhoni New Hairstyle: ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న ఎంఎస్ ధోనీ న్యూ లుక్‌.. హీరోలా ఉన్నాడంటూ కామెంట్స్‌..!

  • By Gopichand Published Date - 05:15 PM, Fri - 28 June 24
  • daily-hunt
MS Dhoni New Hairstyle
MS Dhoni New Hairstyle

MS Dhoni New Hairstyle: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni New Hairstyle) క్రికెట్ నుండి రిటైర్ అయ్యి చాలా కాల‌మైంది. కానీ అతని ప్రత్యేక శైలి, లుక్ ధోనీని త‌రుచూ వార్తల్లో ఉంచుతుంది. ఇప్పుడు చాలా పాపులర్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ సోషల్ మీడియాలో ఒక చిత్రాన్ని పంచుకున్నారు. ఇందులో ధోనీ తన పొడవాటి జుట్టును కత్తిరించి కొత్త లుక్‌లోకి వ‌చ్చాడు. ఈ లుక్ ధోనీ అభిమానుల‌కు తెగ న‌చ్చ‌టంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు.

అయితే హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ధోనీ చిత్రంతో ఓ క్యాప్షన్‌ రాశారు. మా యువ, డైనమిక్ అందమైన మహేంద్ర సింగ్ ధోనీ. మిస్ట‌ర్ కూల్ జుట్టును స్టైలింగ్ చేయడం ఒక సంతోషకరమైన అనుభవం. ధోనీ ఎప్పుడూ చాలా మర్యాదగా ఉంటాడు. అతను ఫోటోలు తీయకుండా నన్ను ఎప్పుడూ ఆప‌లేదు అని ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.

Also Read: Shafali Verma: చ‌రిత్ర సృష్టించిన షెఫాలీ వ‌ర్మ‌.. ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచరీ న‌మోదు..!

.@msdhoni Sports A New Hairdo 💇🏻‍♂️😍#MSDhoni #cricketlover #DhoniFan @MSD_Cricbuzz @DHONIism @imDhoni_fc @TheDhoniEra @TrendsDhoni @DhoniFC @fc_msdhoni pic.twitter.com/5oBEgLphXI

— GOODTIMES (@mygoodtimes) June 28, 2024

కొన్ని వారాల క్రితం రాంచీలో ఉన్న తన ఫామ్‌హౌస్‌లో ధోని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఈ కొత్త హెయిర్‌క‌ట్ వీడియో బయటపడింది. అప్పట్లో వచ్చిన చిత్రాలలో కూడా పొడవాటి జుట్టు ఉన్న ధోనీ ఇప్పుడు తన జుట్టు పొడవును కొద్దిగా తగ్గించాడు. కామెంట్ సెక్షన్‌లో ధోనీకి మరి కొద్ది రోజుల్లో 43 ఏళ్లు నిండుతాయని నమ్మలేకపోతున్నానని ఓ అభిమాని రాశాడు. నిజానికి ధోనీ ఇప్పటికీ చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడని మ‌రో అభిమాని రాసుకొచ్చాడు. ఈ ఫొటో చూసి ధోనీ అభిమానులు చాలా మంది బాలీవుడ్ హీరోల‌కు ఏమాత్రం తీసిపోరంటూ కామెంట్స్ చేస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఐపీఎల్ 2025లో ధోనీ ఆడతాడా?

IPL 2024లో ధోని అద్భుత ప్రదర్శన తర్వాత ధోని తదుపరి సీజన్‌లో ఆడతాడా లేదా అని తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులకు ఉంది. ఇటీవలి సీజన్‌లో అతను CSK కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. గైక్వాడ్‌ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లలేకపోయాడు. IPL 2024లో ధోని 220 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ 161 పరుగులు చేయ‌డం విశేషం. చివ‌ర్లో బ్యాటింగ్‌కు వ‌చ్చి త‌న‌దైన శైలిలో సిక్స్‌లు బాదిన మహీ.. ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను సైతం కొల్ల‌గొట్టాడు. అయితే ఐపీఎల్ 2025 సీజ‌న్‌పై ధోని ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ధోనీ ఫిట్‌గా ఉంటే ఖచ్చితంగా ఐపీఎల్ 2025లో భాగం అవుతాడ‌ని క్రీడా విశ్లేష‌కులు చెబుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CSK
  • dhoni new look
  • ipl 2024
  • IPL 2025
  • ms dhoni
  • MS Dhoni New Hairstyle
  • New Hairstyle

Related News

RCB

RCB: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌కు రంగం సిద్ధం?

ఐపీఎల్‌లో అపారమైన అభిమాన గణం, బలంగా నిలదొక్కుకున్న బ్రాండ్‌గా RCBకి ఉన్న స్థానం దృష్ట్యా, ఈ విక్రయం భారత క్రీడా వ్యాపార రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది. RCB యాజమాన్యం మార్పుపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Latest News

    • Prashant Kishore : మోదీ, రాహుల్ గాంధీ ఎవరూ కూడా తన నుంచి రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు.!

    • Kantara Chapter 1 : ‘కాంతార ఛాప్టర్-1’కు తొలి రోజు భారీ కలెక్షన్స్!

    • Vladimir Putin : అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం వార్నింగ్ ఇచ్చారు.!

    • Bomb Threat : సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు

    • Rains : అల్లకల్లోలంగా శ్రీకాకుళం

    Trending News

      • Social Media: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాపై మంత్రుల‌తో క‌మిటీ!

      • Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

      • Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

      • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

      • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd