All Party Meeting : బడ్జెట్ వేళ.. అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీలు
కాంగ్రెస్ నుంచి ఎంపీ జైరామ్ రమేశ్, గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
- By Latha Suma Published Date - 01:40 PM, Thu - 30 January 25

All Party Meeting : రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలో నిర్వహించిన ఈ భేటీకి పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు , అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ జైరామ్ రమేశ్, గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం అయిన అరగంట తర్వాత.. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవుతాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్-2025ను ప్రవేశపెడుతారు. ఇక, పార్లమెంట్ సమావేశాలు రెండు విడుతల్లో జరుగనున్న విషయం తెలిసిందే. తొలి విడత సమావేశాలు 31 నుంచి మొదలై.. ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. రెండో విడుత సమావేశాలు మార్చి 10న మొదలై.. ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి.
ఇక, అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనలను, అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం వలన, బడ్జెట్ రూపకల్పనలో వారికి అనుకూలమైన మార్పులు చేసే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేయవచ్చు. ప్రతిపక్ష పార్టీలు సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి, బడ్జెట్‌లో పేదలు, రైతులు, కడుగులపై చూపించిన చర్యలు, అంగీకారాలు, పథకాలు గురించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తాయి. రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం చాలా ప్రాధాన్యమైనది. ఎందుకంటే ఇది పార్లమెంటరీ వ్యవహారాలను సజావుగా నడపడానికి ముందు మరింత చర్చ మరియు సహకారం ఏర్పడినట్టు సంకేతాలను ఇస్తుంది.