Motkupalli: ఆసుపత్రిలో చేరిన మోత్కుపల్లి నరసింహులు..!
- Author : Latha Suma
Date : 20-04-2024 - 12:57 IST
Published By : Hashtagu Telugu Desk
Motkupalli Narasimhulu: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుకు తీవ్ర అస్వస్థత..నెలకొందట. అకస్మాత్తుగా మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు బీపీ డౌన్ కావడం, షుగర్ లెవల్స్ పడిపోవడం జరిగిందని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో వెంటనే బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులును చేర్పించారట. ఈ తరుణంలోనే ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. దీంతో ఆందోళనలో మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు కుటుంబ సభ్యులు ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు.
Read Also: Meta AI Assistant : వాట్సాప్, ఇన్స్టాలలో ఏఐ అసిస్టెంట్.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
మరోవైపు మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సొంత పార్టీపై నిరసన గళం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమ జాతికి జరిగిన అన్యాయాన్ని ఆయన మీడియా, సోషల్‌మీడియా వేదికల ద్వారా అధిష్టానం దృష్టికితీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాదిగ సామాజికవర్గానికి టికెట్ లభించలేదని అంటున్నారు. తాను పార్టీలోనే ఉంటూ తమ జాతికి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తానంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నది వేచిచూడాలి.