Myanmar, Bangkok : భూకంప పరిస్థితులపై మోడీ ఆరా..అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధం
సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోడీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
- Author : Latha Suma
Date : 28-03-2025 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
Myanmar, Bangkok : ఆగ్నేయాసియా దేశాలు మయన్మార్, థాయిలాండ్ నేడు భారీ భూకంపంతో వణికిపోయాయి. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోడీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read Also: Nara Lokesh: మంత్రి నారా లోకేష్ ను కలిసి 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్
కాగా, మయన్మార్, థాయిలాండ్‌లో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి భారీ భవనాలు సైతం నెలకొరిగాయి. మయన్మార్ లో ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూలిపోయిన ఓ భవనం శిథిలాల్లో 43 మంది చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. 12 నిమిషాల వ్యవధిలో ఈ రెండు భూకంపాలు సంభవించినట్టు రికార్డయింది. మొదట వచ్చిన భూకంపం తీవ్రత 7.7 కాగా… రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. థాయిలాండ్ లో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అటు, బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ 7.3 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు.
Read Also: Earthquake : మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదు