IPS officers : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ఉత్తర్వులు జారీ
- Author : Latha Suma
Date : 10-07-2024 - 7:44 IST
Published By : Hashtagu Telugu Desk
IPS Officers Transfer: తెలంగాణ(Telangana)లో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు తాజాగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధకారులను బదిలీ చేస్తూ..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్ బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతిలక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర నియామకమయ్యారు. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్‌కుమార్‌ను నియమించింది. పోలీస్ సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా విజయ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.