Maoist : మావోయిస్టు అగ్రనేత జగన్ కన్నుమూత..!
ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు దాదాపు మూడు గంటల పాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటన స్థలంలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తేలింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నేత జగన్ మరణించారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ధృవీకరించింది.
- By Latha Suma Published Date - 05:43 PM, Wed - 4 September 24
Maoist : ఛత్తీస్‌గఢ్ లోని దంతేవాడ – బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతేవాడ జిల్లా లోహగావ్, వురంగేల్ అడవుల్లో ఆండ్రీ గ్రామం వద్ద 40 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో సిఆర్పిఎఫ్, డిఆర్జి దళాల జవాన్లు కూంబింగ్ చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు దాదాపు మూడు గంటల పాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటన స్థలంలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తేలింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నేత జగన్ మరణించారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ధృవీకరించింది.
కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదాపై సుమారు 25 లక్షల రివార్డు ఉంది. మావోయిస్టుల మీడియా కార్యదర్శిగా ఉన్న జగన్.. పత్రికా ప్రకటనలన్నీ ఆయన పేరు మీదనే విడుదల అయ్యేవి. ఈయన స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం. జగన్ 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరి కీలక బాధ్యతలు చేపట్టారు.
కాగా, ఆయన మరణంపై మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. మాచర్ల ఏసోబ్ మరణించారంటూ వస్తున్న వార్తలతో ఆయన స్వగ్రామం టేకులగూడెంలో విషాదం అలుముకుంది. ఈ ఎన్‌కౌంటర్‌తో మొత్తం 9 మంది చనిపోయారు. మృతుల పేరు, రివార్డు వివరాలను పోలీసులు ప్రకటించారు.
మృతి చెందిన మావోయిస్టులు వీరే..
1. రణధీర్ (హోదా-డీకేఎస్‌జెడ్‌సీఎం), వరంగల్ నివాసి- రివార్డ్ రూ.25 లక్షలు.
2. కుమారి శాంతి (హోదా -31 పీఎల్ సభ్యుడు) – రివార్డు రూ.5 లక్షలు.
3. సుశీల మడకం, భర్త జగదీష్ (హోదా- ఏసీఎం) – రివార్డ్ రూ.5 లక్షలు.
4. గంగి ముచకి (హోదా- కాటేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు)- రివార్డ్ రూ.5 లక్షలు.
5. కోసా మాద్వి (హోదా- మలంగిర్ ఏరియా కమిటీ పార్టీ సభ్యుడు) – రివార్డ్ రూ.5 లక్షలు.
6. లలిత (హోదా- డీవీసీఎం సురక్షా దళ్ సభ్యుడు) – రివార్డ్ రూ.5 లక్షలు.
7. కవిత (హోదా- గార్డ్ ఆఫ్ ఏవోబీఎస్‌జెడ్‌సీ – రివార్డ్ రూ.5 లక్షలు.
8. హిడ్మే మంకం (హోదా- డీవీసీఎం సురక్షా దళ్ సభ్యుడు – రివార్డ్ రూ.2 లక్షలు.
9. కమలేశ్ (హోదాప్లాటూన్ సభ్యుడు) బీజాపూర్ జిల్లావాసి – రివార్డ్ రూ.2 లక్షలు.
Read Also: Tamilisai : హేమ కమిటీ నివేదికపై తమిళిసై కీలక వ్యాఖ్యలు
Related News
Bastar’s Unique Tradition: దేవుడికి మరణశిక్ష విధించే కోర్టు.. ఇండియాలోనే
Bastar Unique Tradition: దేవుడికి మరణశిక్ష విధించే కోర్టు. ఈ కోర్టు గిరిజనుల ప్రాబల్యం ఉన్న బస్తర్లో సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. తీర్పు ఆలయంలో జరుగుతుంది. దేవుళ్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుంటే.. ఈ కోర్టు విధించే శిక్ష నుంచి భగవంతుడు కూడా తప్పించుకోలేడు