Tamilisai : హేమ కమిటీ నివేదికపై తమిళిసై కీలక వ్యాఖ్యలు
హేమ కమిటీ నివేదిక సినీ పరిశ్రమలో మహిళల పరిస్ధితులను కండ్లకు కట్టిందని, దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంటే సినీ పరిశ్రమ ఎందుకు కమిటీని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మహిళలు ఎక్కడ పనిచేసినా వారికి భద్రత కల్పించాలని అన్నారు.
- By Latha Suma Published Date - 05:17 PM, Wed - 4 September 24
Hema Committee : బీజేపీ నేత తమిళిసై సౌందర్‌రాజన్ హేమ కమిటీ నివేదికపై చెన్నైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హేమ కమిటీ నివేదిక సినీ పరిశ్రమలో మహిళల పరిస్ధితులను కండ్లకు కట్టిందని, దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంటే సినీ పరిశ్రమ ఎందుకు కమిటీని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మహిళలు ఎక్కడ పనిచేసినా వారికి భద్రత కల్పించాలని అన్నారు. మహిళలు తమ సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు ఓ వేదిక అవసరమని చెప్పారు. తమిళనాడులో కనీసం మహిళా పోలీస్ అధికారికి కూడా భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు భద్రత అవసరం లేదని సీఎం స్టాలిన్ ఆలోచన కావడంతో తనకు కూడా భద్రతను తొలగించారని తమిళిసై పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు.. మహిళలు పనిచేసే చోట వేధింపుల నుంచి వారిని కాపాడాల్సిన అవసరం ఉందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. తమకు భద్రత కల్పించాలని మహిళలు కోరడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె పేర్కొన్నారు. కనిమొళి బుధవారం చెన్నైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహిళలపై ఏ రకమైన వేధింపులు జరగకుండా నిరోధించడం ముఖ్యమని చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళలను కాపాడుకోవాలని ఇది మనందరి కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన లైంగిక దాడి వ్యతిరేక బిల్లుపై సీపీఐ నేత అన్నీ రాజా బుధవారం స్పందించారు. చట్టాలను రూపొందించినా వాటిని పకడ్బందీగా అమలు చేయడమే మన దేశంలో ప్రధాన సమస్యని స్పష్టం చేశారు. భారత పార్లమెంట్ మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ఎన్నో చట్టాలను ఆమోదించిందని గుర్తుచేశారు. మీడియాలో ఏ అంశం ప్రధానంగా వెలుగుచూసినా ఆపై ప్రజాగ్రహం వెల్లువెత్తితే మనం కొత్త చట్టాలను చేయడమో, ఉన్న చట్టాలకు సవరణ చేయడమో చూస్తుంటామని చెప్పారు.
చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడమే సమస్య అని ఆమె పేర్కొన్నారు. చట్టాలను సరిగ్గా అమలు చేసేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులను రాష్ట్రాలకు చేపట్టకపోవడం మరో ప్రధాన అవరోధమని అన్నారు. కాగా, హత్యాచార కేసులో నిందితులకు మరణశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. లైంగిక దాడి వ్యతిరేక బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. దీనికి అపరాజిత బిల్లు అని పేరు పెట్టారు. లైంగిక దాడికి పాల్పడిన వారికి జీవితఖైదు విధించేలా చట్టాన్ని తీసుకొచ్చారు.
Read Also: Devara Song : ‘దేవర’ సాంగ్ వచ్చేసింది.. దావూదీ అంటూ స్టెప్స్ కుమ్మేసిన ఎన్టీఆర్..
Related News
Periods: పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదా.. అయితే జాగ్రత్త మీరు ప్రమాదంలో పడ్డట్టే!
పీరియడ్స్ తరచుగా రానివారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.