KTR : కులగణన సర్వేకు భూములు, ఆస్తులు, ఆప్పులు ఇవన్నీ కావాలా? : కేటీఆర్
KTR : కులగణన కోసం కేవలం క్యాస్ట్ వివరాలు ఒక్కటి, ఇంట్లోని కుటుంబీకుల వివరాలు సరిపోవా? భూములు, ఆస్తులు, ఆప్పులు ఇవన్నీ కావాలా? అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై కేటీఆర్ మండిపడ్డారు.
- By Latha Suma Published Date - 01:18 PM, Tue - 12 November 24

Caste Census Survey : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే (కులగణన) పై స్పందించారు. కులగణన కు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. ఇది మాన్యువల్ పెగాసెస్’ కుల గణనను మేం వ్యతిరేకించడం లేదు.. కులగణన పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం..అన్నారు. ప్రయివేటు వ్యక్తులతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రజల నుంచి వారి వ్యక్తిగత సమాచారం మొత్తం తీసుకుంటున్నారు. ఆ అవసరం ఏముంది? దానికి భద్రత ఏదీ? అని కేటీఆర్ ప్రశ్నించారు. కులగణన కోసం కేవలం క్యాస్ట్ వివరాలు ఒక్కటి, ఇంట్లోని కుటుంబీకుల వివరాలు సరిపోవా? భూములు, ఆస్తులు, ఆప్పులు ఇవన్నీ కావాలా? అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై కేటీఆర్ మండిపడ్డారు.
మరోవైపు అమృత్ పథకంలో జరిగిన అవకతవకలపై మాట్లాడుతూ..కొందరు బడాబాబులకు కేంద్ర ప్రభుత్వం దాసోహమైందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుతోందని ఎద్దేవా చేశారు. అమృత్ టెండర్లలో ప్రభుత్వ అవినీతి స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మొత్తం 8 ప్యాకేజీలుగా అమృత్ పథకానికి టెండర్లను పిలిచారని.. ఎలాంటి అర్హత లేకపోయినా శోదా కంపెనీ కి టెండర్లను కట్టబెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తన బావమరిది సృజన్‌రెడ్డి కి టెండర్లను అప్పగించారని ఆరోపించారు. మొత్తం రూ.8,888 వేల కోట్ల టెండర్లపై సమగ్ర విచారణ జరిపించి రద్దు చేయాలని తాము ఇప్పటికే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరామని గుర్తు కేటీఆర్ తెలిపారు.