Kejriwal : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
Liquor policy scam CBI case : లిక్కర్ పాలసీ కేసులో కొత్తగా సాక్ష్యం కాని, ఆధారం కానీ లేవని.. కేవలం వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారన్నారు. సీబీఐ, కేజ్రీవాల్ తరపున వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
- By Latha Suma Published Date - 05:43 PM, Thu - 5 September 24
Liquor policy scam CBI case : సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ స్కాం సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి… సీబీఐ అరెస్ట్ సరికాదన్నారు. 41ఏ నోటీసులతో కేజ్రీవాల్‌ను ఎలా అరెస్ట్ చేస్తారని వాదనలు వినిపించిన సింఘ్వి.. 41ఏ ప్రకారం అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదని కోర్టుకు తెలిపారు. లిక్కర్ పాలసీ కేసులో కొత్తగా సాక్ష్యం కాని, ఆధారం కానీ లేవని.. కేవలం వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారన్నారు. సీబీఐ, కేజ్రీవాల్ తరపున వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
మనీ లాండరింగ్ కేసులో ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయగా..
సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పొందిన కేజ్రీవాల్ ను కస్టడీలో ఉండగానే సీబీఐ అరెస్ట్ చేసింది. కాగా కేజ్రీవాల్ మళ్ళీ సుప్రీం కోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. అనేక వాయిదాల అనంతరం నేడు విచారణ చేపట్టింది సుప్రీం కోర్ట్. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన కారణాలు అస్పష్టంగా ఉన్నాయని, లిక్కర్ పాలసీ కేసులోని ఎఫ్ఐఆర్ లో కేజ్రీవాల్ ప్రస్తావనే లేదని వాదించారు ఆయన తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.
మనీలాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి లొంగిపోయారు. కాగా.. ఈ కేసులో జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు దిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
కానీ, దీనిపై ఈడీ (ED) అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే దిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జూన్ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జులైలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, అంతకుముందే ఆయన సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్ (Delhi CM Kejriwal) అరెస్టయ్యారు. జూన్ 27 నుంచి సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహాడ్ జైల్లో ఉన్నారు.
Read Also: Asafoetida: ఇంగువ వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
Related News
Supreme Court : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..తాము జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
Israel-Hamas war: ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతిని నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దేశవిదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.