Asafoetida: ఇంగువ వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
తరచుగా ఇంగువను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 05:30 PM, Thu - 5 September 24
మన వంటింట్లో దొరికి మసాలా దినుసులలో ఇంగువ కూడా ఒకటి. చాలా తక్కువ మంది మాత్రమే ఇంగువను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంగువ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఇంగువను తరచుగా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. దీనిని ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఇంగువను ప్రధానంగా చిక్కుళ్ల రుచిని పెంచడానికి, ఊరగాయలు, చట్నీలను మరింత టేస్టీగా మార్చడానికి ఉపయోగిస్తారు.
మరి ఇంగువ వల్ల ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే. ఇంగువ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే ఉబ్బసం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు, తలనొప్పిలను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఆయుర్వేదంలో ఇంగువకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది రక్తపోటు నియంత్రించడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. ఆస్తమా పేషెంట్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట.
అలాగే ఆస్తమా అలాగే శ్వాస కోసం వ్యాధులు ఉన్నవారికి ఎంతో ఇంగువ ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఇంగువను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల తలనొప్పి పొడి దగ్గు నెలసరి నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చును చెబుతున్నారు. ఇంగువ జీర్ణవ్యవస్థకు కూడా మంచి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఉండే కార్బినేటివ్ లక్షణాలు జీర్ణ వ్యాధులను నయం చేస్తాయి. ఇంగువ ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అజీర్థి సమస్యను తగ్గించుకోవడానికి కూడా ఇంగువ ఉపయోగపడుతుంది. అలాగే ఇది కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఎవరికైనా పంటి నొప్పి ఉంటే నొప్పి ఉన్న చోట కొంచెం ఇంగువను పెడితే త్వరగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
note: పైన ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. అందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.