Hemant Soren : రాహుల్, ఖర్గేలతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ
తాను కాంగ్రెస్ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశానని, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు త్వరలో చర్చలు ప్రారంభిస్తాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు.
- Author : Latha Suma
Date : 03-09-2024 - 2:55 IST
Published By : Hashtagu Telugu Desk
Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తాను కాంగ్రెస్ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశానని, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు త్వరలో చర్చలు ప్రారంభిస్తాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
We’re now on WhatsApp. Click to Join.
తాను వీరిని కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. రానున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై తాము చర్చిస్తామని తెలిపారు. తాము పూర్తి బలంతో జార్ఖండ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక హేమంత్ సోరెన్‌తో పాటు ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీలో పాలుపంచుకున్నారు. కాగా, అంతకుముందు జార్ఖండ్ సీఎం సోరెన్ రాజస్ధాన్‌లోని అజ్మీర్లో సూఫీ సన్యాసి ఖ్వాజా గరీబ్ నవాజ్ను సందర్శించారు. రాష్ట్రం, దేశం సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కాగా జేఎంఎం సీనియర్ నేత, జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం హేమంత్ సోరెన్‌తో పాటు పాలక జేఎంఎంకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.