Tomato Face Masks: ముఖంపై మచ్చలతో బాధపడుతున్నారా..? అయితే ఈ ఫేస్ ప్యాక్ వాడండి..!
ఈ ఫేస్ ప్యాక్ మొటిమలను మాత్రమే కాదు అవాంఛిత రోమాలను కూడా తొలగిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును కూడా తెస్తుంది.
- By Gopichand Published Date - 02:45 PM, Tue - 3 September 24

Tomato Face Masks: ముఖంపై మొటిమలు, మచ్చల సమస్య సాధారణం. వాటిని తొలగించడం చాలా కష్టం. మొటిమలు పోయినా అవి ముఖంపై మచ్చలు వచ్చేలా చేస్తాయి. ఈ మచ్చల వల్ల ముఖ సౌందర్యం తగ్గిపోతుంది. ముఖంపై ఉన్న ఈ మచ్చలను తొలగించేందుకు మార్కెట్‌లో లభించే ఉత్పత్తులను వాడుతుంటారు. కొన్నిసార్లు ఇవి కూడా సహాయం చేయవు. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కాకుండా టొమాటోతో ఫేస్ ప్యాక్ (Tomato Face Masks) తయారు చేసి ముఖానికి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
టొమాటోతో చేసిన ఫేస్ ప్యాక్
తేనె- టమోటా
చర్మంపై అప్లై చేయడానికి టమోటా- తేనె కలపండి. ఇది మచ్చలను తొలగించడమే కాకుండా మొటిమలను కూడా తొలగిస్తుంది. టొమాటో, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. అప్పుడు ఫలితం ఉంటుంది.
Also Read: Royal Enfield Classic 350 vs Jawa 350: రాయల్ ఎన్‌ఫీల్డ్-జావా 350.. ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?
పిండి- టమోటా
శనగపిండిని చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ముఖంలోని మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. దీన్ని చేయడానికి టొమాటో పేస్ట్‌ను తయారు చేసి అందులో శెనగపిండిని కలపండి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి.
పెరుగు- టమోటా
పెరుగు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి పనిచేస్తుంది. పెరుగు- టమోటో ఫేస్ ప్యాక్ చర్మ సంరక్షణకు మంచిది. దీన్ని చేయడానికి ఒక టమోటా తీసుకొని దాని తొక్కను తొలగించండి. అందులో పెరుగు కలిపిన పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి. దీని వల్ల ముఖం ఛాయ కూడా మెరుగుపడుతుంది. పైన చెప్పిన ఈ ప్యాక్‌లు వారానికి రెండు, మూడు సార్లు ఉపయోగించాలి. ఈ ఫేస్ ప్యాక్ మొటిమలను మాత్రమే కాదు అవాంఛిత రోమాలను కూడా తొలగిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును కూడా తెస్తుంది. మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని ప్రతి రోజు వాడితే మీరు అందంగా కనిపిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.