HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Is China Preparing To Invade Taiwan

China War: తైవాన్‌ – చైనా మధ్య యుద్ధ మేఘాలు.. ఎందుకు ? ఏమిటి?

తైవాన్‌ - చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తైవాన్‌ జలసంధిపై క్షిపణులతో చైనా విరుచుకుపడింది. దీంతో కలకలం రేగింది.

  • Author : Hashtag U Date : 06-08-2022 - 7:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Taiwan Imresizer
Taiwan Imresizer

తైవాన్‌ – చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తైవాన్‌ జలసంధిపై క్షిపణులతో చైనా విరుచుకుపడింది. దీంతో కలకలం రేగింది. ఈ పరిణామాల వెనక చైనా పునరేకీకరణ అంశం అంతర్లీనంగా ఉంది. తమ దేశంతో తైవాన్ పునరేకీకరణ తప్పకుండా జరగాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఇందుకోసం బలప్రయోగాన్ని ఆయన తోసిపుచ్చలేదు. ఈనేపథ్యంలో యావత్ ప్రపంచ ప్రజలు ఈ రెండు దాయాది దేశాల మధ్యనున్న వైరం గురించి తెలుసుకోవడంపై దృష్టిపెట్టారు.

చైనా.. తైవాన్.. చెరో వాదన

ఆగ్నేయ చైనా తీరానికి దాదాపు 100 మైళ్ల దూరంలో ఉన్న తైవాన్ ద్వీపం తమ దేశంలో భాగమని చైనా అంటోంది. ఇది ఎప్పటికైనా తిరిగి దేశంలో విలీనం కావాల్సిందేనని వాదిస్తోంది. తైవాన్ మాత్రం తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇది అమెరికా కు అనుకూలమైన విదేశాంగ విధానంతో మసులుకుంటోంది.

ఇలా విడిపోయాయి..

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.చైనా ప్రధాన భూభాగంలో జాతీయవాద ప్రభుత్వ దళాలు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య పోరాటం జరిగింది. 1949లో కమ్యూనిస్టులు గెలిచారు. వారి నాయకుడు మావో జెడాంగ్ బీజింగ్‌ పై పట్టు సాధించారు. ఇక జాతీయవాద పార్టీ కోమింటాంగ్ నేతలు చైనా నుంచి తైవాన్‌కు పారిపోయారు.
చాలామంది తైవాన్‌ ప్రజలు తమను తాము తైవానీస్ పిలిపించుకోవడానికి ఇష్టపడతారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

చైనాకు లాభం ఏమిటి?

తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకుంటే ఎక్కువ నష్టం జరిగేది అమెరికాకే. అందుకే అమెరికా దీనిపై రాద్ధాంతం చేస్తోంది. తైవాన్ పై చైనా దూకుడును అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అమెరికాకు ఇంతగా భయం కలిగిస్తున్న అంశం ఏమిటీ ? అనుకుంటున్నారా!! తైవాన్ ఒకవేళ చైనా చేతికి చిక్కితే.. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో దాని ఆధిపత్యం పెరుగుతుంది. అమెరికాలోని గువామ్, హవాయి దీవుల్లో ఉన్న రక్షణ స్థావరాలను చైనా టార్గెట్ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ballastic missiles
  • china
  • military drills
  • preparing war
  • taiwan
  • us
  • world

Related News

Trump- PM Modi

యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ!

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. హోర్ముజ్ మార్గం మూతపడితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని అంచనా.

  • Pakistan

    పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

Latest News

  • Cipla Health : మసాలా జామ రుచితో హైడ్రేషన్‌ చెక్

  • LPG Charges: గ్యాస్ చార్జీల విషయంలో సామాన్యులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్

  • Toing – Food Delivery : నగరంలోకి ‘టోయింగ్’ ఫుడ్ డెలివరీ యాప్!

  • Malabar Gold : చదువుల తల్లికి మలబార్ అండ – రూ. 2.52 కోట్ల స్కాలర్‌షిప్‌లు

  • PM Kisan Yojana: పీఎం కిసాన్ రైతులకు గొప్ప శుభవార్త

Trending News

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

    • రూ. 15 వేల కోట్లకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

    • పంజాబ్ ఆట‌గాళ్ల‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోచ్‌!

    • సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd