CM Revanth Reddy : భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
CM Revanth Reddy : శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా భద్రకాళీ దేశస్థానం పాలక మండలి సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు.
- By Latha Suma Published Date - 04:01 PM, Fri - 27 September 24

Bhadrakali devi sharannavaratri festival: వరంగల్ భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ పాలక మండలి సభ్యులు ఆహ్వానం పలికారు. ఈ మేరకు సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా భద్రకాళీ దేశస్థానం పాలక మండలి సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు.
Read Also: IND vs BAN 2nd Test Day1: వర్షం కారణంగా తొలి రోజు మ్యాచ్ రద్దు
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, వరంగల్‌లో జరిగే భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం సీఎంకు భద్రకాళీ దేవి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ శేషు, ఈవో శేషుభారతి సహా ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.