Tirumala Laddu Issue : అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం
Tirumala Laddu Issue ; బాల రాముడికి బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంపై నిషేధం విధించారు
- By Sudheer Published Date - 03:20 PM, Fri - 27 September 24

తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అంశం (Tirumala Laddu Issue) దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని అందులో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఆయిల్ ఉపయోగించారని సాక్ష్యాత్తు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడంతో పాటు లాబ్ రిపోర్టులు కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం జరిగినట్లుగా హైందవ సమాజం భావిస్తుంది.
ఈ క్రమంలో అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంపై నిషేధం విధించారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదాలనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (Acharya Satyendra Das) తెలిపారు.
దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న నెయ్యి స్వచ్ఛతపై రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (Acharya Satyendra Das) అనుమానం వ్యక్తం చేశారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలు, మఠాల్లో బయట ఏజెన్సీలు తయారు చేసిన ప్రసాదాలను పూర్తిగా నిషేధించాలి. దేవుళ్లకు ప్రసాదం ఆలయ అర్చకుల పర్యవేక్షణలోనే తయారు చేయాలి. అటువంటి ప్రసాదాన్ని మాత్రమే సమర్పించాలి’ అని ఆయన అన్నారు. అదేవిధంగా మార్కెట్లో అమ్ముతున్న నూనె, నెయ్యిల నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
Read Also : Hydraa : పేదవారి కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదు – ఈటెల