Haryana elections : హర్యానా ఎన్నికలు..ఆప్ రెండో జాబితా విడుదల
Haryana elections : ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే నెలలో జరగబోయే హర్యానా ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
- By Latha Suma Published Date - 12:36 PM, Tue - 10 September 24

AAp Second List Released: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే నెలలో జరగబోయే హర్యానా ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలని ఢిల్లీ పార్టీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ ఏడింటిని మాత్రమే వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటివరకూ పొత్తు చర్చలు ఓ కొలిక్కి రాలేదు.
Read Also: Arley Morning: ధనప్రాప్తి కలగాలంటే ఉదయాన్నే ఇలా చేయాల్సిందే!
ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీపై ఆప్ హర్యానా చీఫ్ సుశీల్ గుప్తా ఆసక్తికరంగా స్పందించారు. మొత్తం 90 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉంటుందని తాను భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, వచ్చే నెలలో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
మరోవైపు ఆప్ 10 సీట్లకు క్లెయిమ్ చేసిందని, అయితే కాంగ్రెస్ మూడు మాత్రమే ఆఫర్ చేస్తోందని సోర్సెస్ తెలిపాయి. కాంగ్రెస్ లొంగకపోవడంతో, ఆప్ ముందుగానే తన వైఖరిని కఠినతరం చేసింది. సోమవారం సాయంత్రంలోగా డీల్ ఖరారు కాకపోతే మొత్తం 90 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను తమ పార్టీ విడుదల చేస్తుందని ఆప్ రాష్ట్ర విభాగం చీఫ్ సుశీల్ గుప్తా తెలిపారు.