Governor : వరంగల్ జిల్లాలో 3 రోజుల పాటు గవర్నర్ పర్యటన..!
రేపు యాదాద్రి ఆలయాన్ని గవర్నర్ దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి ములుగుకు చేరుకుంటారు. అక్కడ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు.
- By Latha Suma Published Date - 07:47 PM, Mon - 26 August 24

Governor Jishnu Dev Varma: ఉమ్మడి వరంగల్ జిల్లాలో (Warangal District) తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. రేపు యాదాద్రి ఆలయాన్ని గవర్నర్ దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి ములుగుకు చేరుకుంటారు. అక్కడ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు. యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా ఖండం రామప్ప ఆలయాన్ని వీక్షించి లక్నవరంకు వెళ్లనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
రేపు రాత్రి లక్నవరం లో బస చేసి మరుసటి రోజు హనుమకొండలో పేరొందిన కళాకారులు, ప్రముఖులతో సమావేశం కానున్నారు. అనంతరం వరంగల్ ఖిల్లాను, భద్రకాళీ, వేయిస్తంభాల ఆలయాలను గవర్నర్ సందర్శిస్తారు. రాత్రి వరంగల్ నిట్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఇక మూడో రోజు జనగామ జిల్లాలో కవులు, కళాకారులతో సమావేశమై అక్కడి నుంచి కొలనుపాకను సందర్శిస్తారు. అయితే గవర్నర్ పర్యటనకు నాలుగు జిల్లాల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో లో మంత్రి సీతక్క అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా లక్నవరం సరస్సును సందర్శించనున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ఏర్పాట్లు జరుగుతున్న తీరును నిశితగా గమనించి పలు సలహాలు సూచనలు చేశారు. బోటులో ఐర్లాండ్లను సందర్శించే నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అదేవిధంగా రహదారులకు ఇరువైపులా ఎక్కడ పిచ్చి మొక్కలు చెత్త లేకుండా చేస్తున్న పనులను పరిశీలించి పంచాయతీరాజ్ అధికారులకు సలహాలు ఇచ్చారు. లక్నవరం పర్యాటక కేంద్రం సుందరీకరణ పనులను కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చీమలపాటి మహేందర్, స్థానిక తహసిల్దార్ సృజన్ కుమార్, ఆర్ ఐ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.