Chiranjeevi : ఈశ్వరయ్య ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
ఈశ్వరయ్య అనే వీరాభిమాని మెట్ల మార్గంలో పొర్లుదండాలు పెట్టుకుంటూ తిరుమల కొండ ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్న సంగతి అందరికీ తెలిసిందే
- Author : Sudheer
Date : 26-08-2024 - 7:16 IST
Published By : Hashtagu Telugu Desk
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి కోట్లాది అభిమానులు ఉంటారనే సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమా విడుదలైన , పుట్టిన రోజైన (Chiranjeevi Birthday) తమ ఇంట్లో వేడుకలగా నిర్వహిస్తుంటారు. తాజాగా ఆగస్టు 22 న చిరంజీవి బర్త్ డే సందర్బంగా చాలామంది అభిమానులు అలాగే చేయగా..ఈశ్వరయ్య (Eswaraiah) అనే వీరాభిమాని మెట్ల మార్గంలో పొర్లుదండాలు పెట్టుకుంటూ తిరుమల కొండ ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలంటూ తిరుమల వెంకన్నను ప్రార్థించారు. ఈ విషయం తెలిసి చిరంజీవి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈశ్వరయ్య, ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. వారిక కుటుంబానికి పట్టు బట్టలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని మెగాస్టార్ హామీనిచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె సోమవారం రోజున చిరంజీవి అయ్యప్ప మాలను ధరించారు. ప్రతీ ఏడాది అయ్యప్ప మాలను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాలను ధరించారు. మాలధారణలోనూ ఈశ్వరయ్య కుటుంబంతో చిరంజీవి కలిసి మాట్లాడారు. సాధారణంగా చిరంజీవి తన హార్డ్ కోర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలుస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇది నిరూపణ అయ్యింది. ఇప్పుడు ఈశ్వరయ్య గురించి తెలియగానే మరోసారి మెగాస్టార్ ఆయన్ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. గతంలో ఈశ్వరయ్య తిరుపతి నుంచి మెగాస్టార్ ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు, జనసేన పార్టీ నెగ్గాలని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయటం విశేషం.
Read Also : HYDRA : కాంగ్రెస్ ప్రభుత్వానికి బిజెపి సవాళ్లు..!