HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Good News From The Center For Fastag Users

FASTag annual pass : ఫాస్టాగ్‌ యూజర్లకు కేంద్రం శుభవార్త

ఈ పాస్‌ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది.

  • Author : Latha Suma Date : 18-06-2025 - 1:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KYV
KYV

FASTag annual pass : దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్న ప్రైవేట్ వాహనదారులకు శుభవార్త. జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల్లో రద్దీ తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ పాస్‌ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది. ఇది పూర్తిగా ఫాస్టాగ్‌తో అనుసంధానించబడిన వ్యవస్థగా పనిచేస్తుందని గడ్కరీ తెలిపారు.

Read Also: CM Revanth Reddy : గూగుల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

ఈ పాస్ ప్రధానంగా కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఈ పాస్ ఉపయోగించవచ్చు. దాని యాక్టివేషన్ కోసం ప్రత్యేకమైన లింక్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని, ఇది రాజ్‌మార్గ్ యాప్, NHAI, మరియు MoRTH అధికారిక వెబ్‌సైట్లలో లభ్యమవుతుందని గడ్కరీ వెల్లడించారు. ఇదివరకు ప్రయాణికులు చాలాకాలంగా టోల్ ఛార్జీలపై స్థిరమైన, ప్రాక్టికల్ పరిష్కారం కోరుతున్నారు. టోల్‌ప్లాజాల వద్ద రోజూ ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలు, క్యూలైన్లలో వాహనాలు నిలిచిపోవడం, కొన్ని సందర్భాల్లో వాహనదారులు అధికారులు మధ్య తలెత్తే వివాదాలను దృష్టిలో పెట్టుకొని, ఈ కొత్త పాస్ విధానం తీసుకువచ్చినట్లు గడ్కరీ వివరించారు.

ఈ పాస్ ద్వారా టోల్‌ప్లాజాల వద్ద వేచిచూడే సమయం గణనీయంగా తగ్గిపోతుందని, వాహనదారులకు స్నేహపూర్వకమైన ప్రయాణ అనుభవాన్ని ఇది కలిగిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులకు ఇది పెద్ద ఊరటగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది భవిష్యత్‌లో మరింత ఆధునీకరణకు దారి చూపించే విధానమని, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారబోతున్న దశగా ప్రభుత్వం దీన్ని చూస్తోందని సమాచారం. ఫాస్టాగ్ ఆధారిత ఈ వార్షిక పాస్ ద్వారా దేశ వ్యాప్తంగా వాహనదారులు ఒకే విధానంలో, స్థిరమైన వ్యయంతో ప్రయాణించగలిగే అవకాశం కలుగనుంది. ఇది డిజిటల్ ఇండియా దిశగా మరో ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది.

Read Also: Murder : గోవాలో ప్రేమజంట విషాదాంతం.. ప్రేయసిని గొంతుకోసి

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • FASTag annual pass
  • National Highways
  • Non-commercial vehicles
  • Private motorists
  • Union Minister Nitin Gadkari

Related News

Esic Hospital

తెలంగాణలో మరో ESIC హాస్పిటల్‌.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

Esic Hospital : తెలంగాణలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. శంషాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక కార్మికుల కోసం 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ వద్ద రూ. 16.12 కోట్ల విలువైన భూసేకరణకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జిల్లాలోని 1.32 లక్షల మంది బీమా క

    Latest News

    • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

    • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

    • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

    • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

    • దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

    Trending News

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd