CM Revanth Reddy : గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఇది రెండో కేంద్రం కావడం విశేషం కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇది గూగుల్ సంస్థకు నాలుగవ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కావడం గర్వకారణం. ఈ సెంటర్ ప్రారంభంతో హైదరాబాద్ నగరం గ్లోబల్ డిజిటల్ భద్రత రంగంలో కీలక పాత్ర పోషించనున్నది.
- By Latha Suma Published Date - 12:59 PM, Wed - 18 June 25

CM Revanth Reddy : హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ఐటీ గమ్యస్థానంగా మరింతగా అభివృద్ధి చేయడంలో మరో కీలక ఘట్టం నమోదైంది. ఈరోజు (జూన్ 18వ తేదీన) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఇది రెండో కేంద్రం కావడం విశేషం కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇది గూగుల్ సంస్థకు నాలుగవ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ కావడం గర్వకారణం. ఈ సెంటర్ ప్రారంభంతో హైదరాబాద్ నగరం గ్లోబల్ డిజిటల్ భద్రత రంగంలో కీలక పాత్ర పోషించనున్నది. గూగుల్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు మరింత సురక్షితమైన డిజిటల్ సేవలు అందించడమే. ముఖ్యంగా ఏషియా పసిఫిక్ ప్రాంతంలోని వినియోగదారులకు గూగుల్ సేవల విషయంలో భద్రతా ప్రమాణాలను పెంపొందించేందుకు ఈ సెంటర్ కేంద్రీకరించబోతుంది.
Read Also: Vijay-Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక ఇలా దొరికేసారేంటీ..!
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దూదిల శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ..తెలంగాణను డిజిటల్ రంగంలో దేశానికి ప్రపంచానికి మార్గనిర్దేశకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గూగుల్ వంటి బహుళజాతీయ సంస్థలు ఇక్కడ కేంద్రాలు ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మైలురాయి అని తెలిపారు. ఈ సెంటర్ ద్వారా ఐటీ రంగంలో వేల సంఖ్యలో నేరుగా మరియు పరోక్షంగా ఉద్యోగావకాశాలు సృష్టికాబోతున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సైబర్ భద్రత, డేటా ప్రొటెక్షన్, వినియోగదారుల గోప్యత వంటి రంగాల్లో నిపుణులను ఈ కేంద్రం నియమించనుంది. గూగుల్ ఇప్పటికే డేటా భద్రతకు సంబంధించి ప్రపంచ స్థాయిలో విధానాలను రూపొందిస్తున్న సంస్థగా పేరుగాంచింది.
ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి పెరుగుతుందని, స్టార్టప్‌లకు, టెక్ కంపెనీలకు సహకార వేదికగా నిలవనుందని అధికారులు వెల్లడించారు. గూగుల్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ..హైదరాబాద్‌లో ఉన్న ప్రతిభావంతులైన యువత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మద్దతుతో పాటు ప్రభుత్వ సహకారం వల్ల ఈ కేంద్రం ఇక్కడ ప్రారంభించాం అని పేర్కొన్నారు. ఇంతవరకు గూగుల్‌కు జర్మనీలోని మ్యూనిక్, అమెరికాలోని మౌంటెన్‌వ్యూ, న్యూయార్క్‌లో సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నాల్గవ సెంటర్‌గా నిలిచినదే కాకుండా, భారతదేశానికి ఇది తొలి సేఫ్టీ ఇంజినీరింగ్ కేంద్రం కావడం మరింత విశిష్టతను తీసుకొచ్చింది.
Read Also: Hindi language : పాఠశాలల్లో హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం..