Madhabi Puri Buch : సెబీ మాజీ చీఫ్‌కు బాంబే హైకోర్టులో ఊరట
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీలను లిస్ట్ చేయడంలో పెద్దఎత్తున ఆర్థిక మోసం, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ థానేకు చెందిన జర్నలిస్ట్ సపన్ శ్రీవాత్సవ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
- By Latha Suma Published Date - 01:48 PM, Tue - 4 March 25

Madhabi Puri Buch : సెబీ (SEBI) మాజీ చీఫ్ మాధవి పురి బచ్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు నిలిపివేసింది. మాధవి పురి బచ్‌తో పాటు మరో అయిదుగురు ఉన్నతాధికారులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీలను లిస్ట్ చేయడంలో పెద్దఎత్తున ఆర్థిక మోసం, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ థానేకు చెందిన జర్నలిస్ట్ సపన్ శ్రీవాత్సవ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Read Also: Drugs : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ ?
ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ‘‘పూర్తిస్థాయి పరిశీలన లేకుండా కింది కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన తర్వాత వాటిని నిలిపివేస్తున్నాం’’ అని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. మాధవి పురి బచ్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధవి పెట్టుబడులు పెట్టారని గతేడాది ఆగస్టులో హిండెన్‌బర్గ్ చేసిన పోస్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి.
కాగా, మాధవి పురి బచ్ గత కొన్ని నెలలుగా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. అదానీ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో మాధవి పెట్టుబడులు పెట్టారని గతేడాది ఆగస్టులో హిండెన్‌బర్గ్ చేసిన పోస్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి. ఇందులో తన భర్త ధావల్ బచ్‌కు కూడా పెట్టుబడులు ఉన్నాయని పేర్కొనడం చర్చకు దారితీసింది. అవన్నీ తప్పుడు ఆరోపణలే అంటూ వివరణ ఇచ్చారు బచ్ దంపతులు.
Read Also: Kejriwal : 10 రోజుపాటు ‘విపశ్యన’ ధ్యానంలో కేజ్రీవాల్