HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Delhi New Cm Atishi Press Meet

Atishi : ఇలాంటి అవకాశం ఆప్‌లోనే సాధ్యం అవుతుంది: అతిషీ

Delhi New CM Atishi: ఢిల్లీ సీఎంగా నన్ను ఎంపిక చేసినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాపై ఎంతో నమ్మకంతో ఆ బాధ్యతను అప్పగించారు. ఇలాంటి అవకాశం ఆప్‌లోనే సాధ్యం అవుతుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ అవకాశం కల్పించారు.

  • Author : Latha Suma Date : 17-09-2024 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi new cm atishi press meet
Delhi new cm atishi press meet

Delhi new cm atishi press meet:  ఢిల్లీ తదుపరి సీఎంగా మంత్రి అతిశీ మర్లెనా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికైన అనంతరం ఆమె తొలి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ”ఢిల్లీ సీఎంగా నన్ను ఎంపిక చేసినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాపై ఎంతో నమ్మకంతో ఆ బాధ్యతను అప్పగించారు. ఇలాంటి అవకాశం ఆప్‌లోనే సాధ్యం అవుతుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ అవకాశం కల్పించారు. ఇతర పార్టీల్లో ఉన్నట్లయితే నాకు ఎన్నికల్లో టికెట్‌ కూడా దక్కేది కాదు. కేజ్రీవాల్‌ నన్ను ఎమ్మెల్యేను, మంత్రిని చేశారు.. ఇవాళ సీఎం అయ్యే అవకాశం వచ్చింది” అని అతిశీ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ని తన గురువుగా అభివర్ణించారు. తదుపరి ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

Read Also: Man Control Alexa : మెదడుతో అలెక్సాను కంట్రోల్ చేయొచ్చు.. ఎలా అంటే ?

కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు నమోదు చేసి, ఆప్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని బీజేపీపై అతిషీ ఆరోపణలు గుప్పించారు. ”ఢిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి, అది అరవింద్ కేజ్రీవాల్.. కేజ్రీవాల్‌ను తిరిగి ఢిల్లీ ముఖ్యమంత్రిగా తీసుకురావడమే లక్ష్యంగా రాబోయే కొద్ది నెలల పాటు కృషి చేస్తాను.” అని ఆమె అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఒక రాష్ట్రానికి సీఎం కావడం ఆప్‌లోనే సాధ్యమని అన్నారు. ”నేను వేరే పార్టీలో ఉండి ఉంటే, బహుశా నాకు ఎన్నికల టిక్కెట్ కూడా ఇచ్చేది కాదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ నన్ను నమ్మి, నన్ను ఎమ్మెల్యే మరియు మంత్రిని చేసి, ఈ రోజు నాకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చారు” అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు 14 పోర్ట్‌ఫోలియోలను అతిశీ చూస్తున్నారు.

సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కి బెయిల్ ఇవ్వడం కేంద్రానికి చెంపెట్టని ఆమె అన్నారు. కేజ్రీవాల్‌ని తిరిగి సీఎంగా ఢిల్లీ ప్రజలు ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నిజాయితీ గురించి ప్రజలందరికీ తెలుసని, ఢిల్లీ ప్రజకు అందుతున్న సంక్షేమాన్ని గుర్తించి కేజ్రీవాల్‌ని సీఎం చేస్తారని ఆమె అన్నారు. కేజ్రీవాల్ సీఎం కాకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మొహల్లా క్లినిక్స్, ఉచిత వైద్యం ఉండవని చెప్పారు.

Read Also: Mandula Samuel : కౌశిక్ కు మతిభ్రమించింది – ఎమ్మెల్యే మందుల శామ్యూల్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aam aadmi party
  • Atishi Marlena
  • bjp
  • Delhi New CM

Related News

Karimnagar Mayor As Kolagani Srinivas

కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

Karimnagar Mayor  పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన కరీంనగర్ కార్పొరేషన్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది.  కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది. బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ ప

    Latest News

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • ప్రియురాలితో గడిపేందుకు భర్త కిడ్నాప్‌ వ్యూహం !!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

    • పచ్చి బీట్‌రూట్ తింటున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి!

    Trending News

      • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

      • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd