HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sits Sensational Report On Sai Krishnas Death

Gade Sai Krishna: సాయి కృష్ణ డెత్ పై.. SIT సంచలన రిపోర్ట్

  • Author : Vamsi Chowdary Korata Date : 24-06-2026 - 2:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SIT's sensational report on Sai Krishna's death.
SIT's sensational report on Sai Krishna's death.

విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలను పేర్కొంది. సాయికృష్ణ మరణించారని గుర్తించామని.. అతడిది కస్టోడియల్ డెత్ అని తేలిందని.. మృతదేహాన్ని మాయం చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని.. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపరచలేదని అన్నారు. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో.. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టామని సిట్ రిపోర్టులో ప్రస్తావించింది. ఈ కేసులో 17 మంది సాక్షులను ప్రశ్నించామని.. సాయికృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో చూసినట్లు ఎస్సై కూడా వాంగ్మూలం ఇచ్చారని సిట్ తెలిపింది.

సాయికృష్ణ మరణించాడని తెలిసినా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారాన్ని మెజిస్ట్రేట్‌కు చేరవేయలేదని సిట్ పేర్కొంది. సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే సీఐ నాగరాజు దూషించారని.. సాక్ష్యాలు నాశనం కావడానికి ఆయన కారణమని అన్నారు. హైకోర్టు ముందు నిజాలు దాచారని.. కోర్టును తప్పుదోవ పట్టించారని సిట్ తెలిపింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ చేరిపోవడం ద్వారా సాయికృష్ణ మరణించినట్లు గుర్తించామన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేశారని.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ప్రశ్నించాల్సి ఉందన్నారు. సాయికృష్ణ ఘటన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్‌లో లేకుండా చేశారని రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి కీలకంగా మారిన డీవీఆర్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని సిట్ తెలిపింది. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని.. ఈ కేసులో తీవ్రమైన అంశాలున్నాయని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా.. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో అరెస్టైన సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడలోని 2వ ఏజేఎస్ కోర్టులో సిట్ హాజరై రిమాండ్ రిపోర్టును సమర్పించింది. సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా.. సీఐని నెల్లూరు జైలుకు సిట్ తరలించింది. సిట్ నాగరాజును ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీస్ ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగేలా చర్యలు తీసుకున్నామని.. ఈ కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. ఏజీ వాదనలను విన్న కోర్టు ఏం చేస్తారో వేచి చూద్దామంటూ ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CI Nagaraju
  • Gade Sai Krishna
  • missing case
  • Sit Remand Report
  • vijayawada

Related News

    Latest News

    • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

    • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

    • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

    • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

    • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd