Man Control Alexa : మెదడుతో అలెక్సాను కంట్రోల్ చేయొచ్చు.. ఎలా అంటే ?
అతడి మెదడులో రేకెత్తే ఆలోచనలను ఆ బ్రెయిన్ చిప్ గ్రహించి అమెజాన్ ఫైర్‌స్టిక్ టాబ్లెట్‌లోని సంబంధిత ఐకాన్‌లో యాక్టివిటీ జరిగేలా ప్రాంప్ట్‌ను(Man Control Alexa) పంపిస్తుంది.
- By Pasha Published Date - 03:16 PM, Tue - 17 September 24

Man Control Alexa : ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్‌కు చెందిన అలెక్సా ఒక అద్భుత ఆవిష్కరణ. ఇక మన మెదడులోని ఆలోచనలతోనూ అలెక్సాను కంట్రోల్ చేయొచ్చు. దానికి ఆదేశాలను జారీ చేయొచ్చు. కమాండ్స్‌ను ఇవ్వొచ్చు. అదెలాగో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Indians Earning : మన దేశంలో 31,800 మందికి ఏటా రూ.10 కోట్ల ఆదాయం
వాస్తవానికి పైన మనం చెప్పుకున్న ఆవిష్కరణను ఆరోగ్యవంతులైన యూజర్ల కోసం రూపొందించలేదు. మెదడు, కండరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి కోసం, పక్షవాత రోగుల కోసం దాన్ని తయారు చేశారు. సింక్రాన్ అనే టెక్ కంపెనీ ఈ టెక్నాలజీని రెడీ చేసింది. ఇందులో భాగంగా ఒక అత్యాధునిక బ్రెయిన్ చిప్‌ను రూపొందించారు. దాన్ని మెదడు నరాల వ్యాధితో బాధపడుతున్న 64 ఏళ్ల వృద్ధుడి మెదడు రక్తనాళంపై అమర్చి ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. అతడి మెదడులో రేకెత్తే ఆలోచనలను ఆ బ్రెయిన్ చిప్ గ్రహించి అమెజాన్ ఫైర్‌స్టిక్ టాబ్లెట్‌లోని సంబంధిత ఐకాన్‌లో యాక్టివిటీ జరిగేలా ప్రాంప్ట్‌ను(Man Control Alexa) పంపిస్తుంది.
Also Read :Jio Services Down : జియో సేవల్లో అంతరాయం.. వేలాదిగా ఫిర్యాదుల వెల్లువ
వీడియో కాల్ చేయడం, మ్యూజిక్ ప్లే చేయడం, ఓటీటీ షోను స్ట్రీమ్ చేయడం, స్మార్ట్ హోం డివైజ్‌ను వాడటం, ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, పుస్తకాలు చదవడం వంటి ఆలోచనలు వచ్చినప్పుడు.. ఆ ఆలోచనను సదరు బ్రెయిన్ చిప్ ప్రాసెసింగ్ చేసి ఎలక్ట్రానిక్ సిగ్నల్ రూపంలోకి మారుస్తుంది. ఆ సిగ్నల్‌కు అనుగుణంగా అమెజాన్ ఫైర్‌స్టిక్ టాబ్లెట్‌లోని ఐకాన్‌ల ఎంపిక ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మెదడు నరాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మ్యూజిక్ ప్లే చేయాలని ఆలోచిస్తే.. అమెజాన్ ఫైర్‌స్టిక్ టాబ్లెట్‌లోని మ్యూజిక్ ఐకాన్ ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది. వెంటనే మ్యూజిక్‌ను ప్లే చేసే పనిని ప్రారంభిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయిందని టెక్ కంపెనీ సింక్రాన్ వెల్లడించింది. తమ బ్రెయిన్ చిప్‌ను పక్షవాత రోగులు మెదడులో అమర్చుకొని అలెక్సా అనుసంధాన డివైజ్‌లను ఆలోచనలతో కంట్రోల్ చేయొచ్చని తెలిపింది. ఇందుకోసం స్మార్ట్‌హోమ్ సిస్టమ్స్ వాడాలని పేర్కొంది. స్మార్ట్‌హోమ్ సిస్టమ్స్‌ను టచ్ లేదా వాయిస్ కమాండ్లతో ఆపరేట్ చేయొచ్చని సింక్రాన్ కంపెనీ వెల్లడించింది.