Vallabhaneni Vamsi : జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ
Vallabhaneni Vamsi : గురువారం జగన్‌ను కలిసిన వంశీ, కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ కూడా వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు
- Author : Sudheer
Date : 03-07-2025 - 2:13 IST
Published By : Hashtagu Telugu Desk
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) తన పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan)ని గురువారం తాడేపల్లిలోని నివాసంలో కలిశారు. న్యాయపరమైన సమస్యలతో సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న వంశీ, బుధవారం న్యాయస్థానాల తీర్పు తో విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం జగన్‌ను కలిసిన వంశీ, కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ కూడా వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంశీ భార్య పంకజశ్రీ కూడా అతనితో పాటు ఉన్నారు.
AP Assembly Elections : పోలింగ్ శాతంపై ఈసీని కలిసిన వైసీపీ బృందం
వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి. కూటమి ప్రభుత్వం తనపై కక్ష్య కట్టి..కావాలనే వేధింపులకు గురిచేసిందని వంశీ ఈ సందర్బంగా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్యగా వ్యవహరించినట్లు వంశీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక వంశీ సుమారు 140 రోజుల పాటు విజయవాడ జైలు గదుల్లోనే గడిపారు. జైల్లో ఉన్న సమయంలో ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ, కూటమి ప్రభుత్వం విడుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు వంశీ శ్రేణులు చెబుతున్నాయి.
CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు
వంశీ విడుదలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో కూడ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి పూర్తి ఊరట ఇవ్వడంతో బుధవారం ఉదయం ఆయన విజయవాడ జైలు నుంచి బయటకు వచ్చారు. జగన్ ను వంశీ కలవడం తో పార్టీ శ్రేణుల్లో ఈ భేటీ పట్ల సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. కష్టకాలంలో సహకారం అందించిన పార్టీ, నాయకత్వం పట్ల వంశీ లోనైన నమ్మకాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోంది.