CM Revanth Reddy : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
CM Revanth Reddy : ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల వద్ద యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో నిర్మించ తలపెట్టిన స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, భవన నమూనా చిత్రాలను పరిశీలించారు.
- Author : Latha Suma
Date : 21-10-2024 - 6:53 IST
Published By : Hashtagu Telugu Desk
Young India Police School : రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు ఇక్కడ విద్య అందించనున్నారు. తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ సర్కార్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల వద్ద యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో నిర్మించ తలపెట్టిన స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, భవన నమూనా చిత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి శ్రీధర్ బాబు తడితరులు పాల్గొన్నారు. కాగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-5వ తరగతులతో ఈ స్కూల్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ.. డిగ్రీ వరకు నాణ్యమైన, అత్యుత్తమ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్యను అందించనున్నారు.