Chicken Blood-Honey Trap : కోడిరక్తంతో హనీ ట్రాప్..బిజినెస్ మ్యాన్ నుంచి కోట్లు వసూల్
Chicken Blood-Honey Trap : హనీ ట్రాప్ చేయడం కోసం వాళ్ళు కోడి రక్తాన్ని వాడుకున్నారు..
- By Pasha Published Date - 02:28 PM, Mon - 17 July 23

Chicken Blood-Honey Trap : హనీ ట్రాప్ చేయడం కోసం వాళ్ళు కోడి రక్తాన్ని వాడుకున్నారు..
కోటీశ్వరుడైన ఓ బిజినెస్ మ్యాన్ ను తమ ట్రాప్ లోకి లాగేందుకు కోడి రక్తాన్ని ఉపయోగించారు..
“నువ్వు.. మా ఇద్దరిపై చేసిన సెక్సువల్ అటాక్ కు రక్తసిక్తం అయ్యాం.. నీ సెక్సువల్ అటాక్ వల్లే మేం రక్తంలో తడిసి ముద్దయ్యాం. దానికి సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. నీపై పోలీసులకు కంప్లైంట్ చేసి, పరువు తీస్తాం ” అంటూ ఇద్దరు మహిళలు ఆ బిజినెస్ మ్యాన్ ను బ్లాక్ మెయిల్ చేశారు.
64 ఏళ్ల వయసున్న ఆ బిజినెస్ మ్యాన్.. ఇద్దరు మహిళలు చూపించిన వీడియోలోని దృశ్యాలు నిజమైనవే(Chicken Blood-Honey Trap) అని నమ్మాడు..
విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని భయపడి.. 2019 సంవత్సరంలో ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్లకు రూ.3.25 కోట్లు ఇచ్చుకున్నాడు..
Also read : Check your Vote : ఓటుపై చంద్రబాబు యుద్ధం
ఇంకో 2 కోట్లు డిమాండ్ చేయడంతో..
ఇంకో రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. చేసేది లేక 2021 నవంబర్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబైలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో దిమ్మ తిరిగే విషయం బయటపడింది. ఆ ఇద్దరు మహిళలు కోడి రక్తాన్ని శరీర భాగాలకు రుద్దుకొని.. నిద్రమత్తులో ఉన్న ఆ వ్యాపారి పక్కన పడుకొని ఏడుస్తున్నట్టుగా ఫోజులు పెట్టి మరీ వీడియో తీయించుకున్నారని దర్యాప్తులో తేలింది. పోలీసు కస్టడీలో ఈ విషయాన్ని ఇద్దరు కిలాడీ మహిళలు(సప్నా, మోనిక) ఒప్పుకున్నారు. వీడియో తీసిన లుబ్నా వజీర్ తో పాటు హనీ ట్రాప్ ప్లాన్ వేయడంలో ఇద్దరు మహిళలను తెర వెనుక నుంచి నడిపించిన అనిల్ చౌదరిని కూడా అరెస్ట్ చేశారు.
Also read : Major League Cricket: అమెరికాలో చెన్నై ఆటగాడి కళ్ళు చెదిరే భారీ సిక్సర్
ఇలా మొదలైంది.. ఇలా ముగిసింది
కొల్హాపూర్‌కు చెందిన ఆ వ్యాపారితో 2017 సంవత్సరంలో అనిల్ చౌదరి, సప్నాకు పరిచయం ఏర్పడింది. రెండేళ్ల పాటు ఆ వ్యాపారి ఆస్తిపాస్తులు, ఆర్ధిక స్థోమతను వాళ్ళు స్టడీ చేశారు. కోడి రక్తంతో ఆ వ్యాపారిని హనీ ట్రాప్ ఉచ్చులో ఇరికించాలనే ప్లాన్ ను 2019లో రెడీ చేశారు. ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఆ వ్యాపారి ఉండగా.. సప్నా, మోనిక కలిసి అతడున్న రూమ్ కు వెళ్లారు. బయట ఒక వ్యక్తిని కెమెరాతో రెడీగా ఉంచారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో బిజినెస్ మ్యాన్ నిద్రమత్తులోకి జారుకున్నాడు.. అనంతరం ఇద్దరు మహిళలు తమతో తెచ్చుకున్న కోడి రక్తంతో యాక్షన్ మొదలుపెట్టారు. ఇదంతా వీడియో తీయించుకున్నారు. ఆ బిజినెస్ మ్యాన్ స్పృహలోకి వచ్చాక.. బ్లాక్ మెయిలింగ్ గేమ్ ను షురూ చేశారు.