MLC kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత
వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
- By Latha Suma Published Date - 01:14 PM, Thu - 22 August 24

MLC kavitha: బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి అస్వస్థత గురయ్యారు. వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా గత జులైలోనూ కవిత జ్వరం, గొంతునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆమెను జైలు నుంచి ఎయిర్స్ కు దీనదయార్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి జైలుకు తరలించారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా మరోసారి కవిత అస్వస్థతకు గురికావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెండ్, కవిత సోదరుడు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కవిత కేసు విచారణను నిన్న ఈ నెల 28కి కోర్టు వాయిదా వేసింది. బుధవారం కవితపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కర్టులో విచారణ జరగ్గా తిహార్ జైలు నుంచి కవితను అధికారులు వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుండి ఆమె తీహార్ జైలులోనే ఉన్నారు. రెండు రోజుల క్రితమే.. ఆగస్టు 20 నాడు సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే, కవిత బెయిల్ పిటిషన్ లో సీబీఐ, ఈడీ ప్రతివాదులుగా ఉన్నారు. ఈ బెయిల్ పిటిషన్ తిరస్కరించాల్సిందిగా కోరుతూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈడీ నుండి కోర్టుకు ఇంకా అఫిడవిట్ అందలేదు.
ఈ నేపథ్యంలో ప్రతివాదుల వాదన వినకుండా బెయిల్ మంజూరు చేయలేమంటూ సుప్రీం కోర్టు కవిత బెయిల్ పిటిషన్ విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఆగస్టు 22వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఈడికి సూచించింది. ఈ క్రమంలోనే కవిత్ బెయిల్ పిటిషన్ తదుపరి విచారణకు మరో 5 రోజులు మిగిలి ఉండగానే ఆమె అస్వస్థతకు గురయ్యారు.
Read Also: Plants at Home: ఇంట్లో ఉన్న నెగెటివిటీ తొలగిపోవాలంటే ఈ మొక్కలను ఇంట్లో ఉండాల్సిందే!