Plants at Home: ఇంట్లో ఉన్న నెగెటివిటీ తొలగిపోవాలంటే ఈ మొక్కలను ఇంట్లో ఉండాల్సిందే!
ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ని తొలగించుకోవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Thu - 22 August 24

చాలామందికి మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే ఇంట్లో కాస్త ప్లేస్ దొరికింది అంటే చాలు వెంటనే రకరకాల మొక్కలను పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇండోర్ ప్లాన్స్ మాత్రమే కాకుండా అవుట్డోర్ ప్లాంట్స్ ని కూడా ఇంటి చుట్టూ పెంచుతూ ఉంటారు. మొక్కలు ఉండటం వల్ల ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గాలిని ప్యూరిఫై చేస్తుందని చెప్పవచ్చు. అలాగే మొక్కలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ ఉన్న వారి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. అయితే మొక్కల్లో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివిటీ దూరమవుతుందని చెబుతున్నారు. మరి నెగిటివిటి ని దూరం చేసే ఆ మొక్కలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హిందువుల ఇండ్లలో దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్క తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి కూడా. ఎలాంటి అనారోగ్య సమస్యలను అయినా కంట్రోల్ చేసే శక్తి ఈ మొక్కకు ఉంది. అందుకే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాలని, పూజించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలలో పీస్ లిల్లీ మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. ఇది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించి, పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చేస్తుంది. అంతే కాదు గాలిని కూడా శుద్ధి చేస్తుంది. గాలిలో ఉండే టాక్సిక్స్ ను కూడా తొలగిస్తుందని చెబుతున్నారు.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలలో మనీ ప్లాంట్ మొక్క ఒకటి. ఈ మొక్కను అదృష్టానికి కూడా చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల గాలిని శుద్ధి చేస్తుంది. అలాగే ఈ మొక్క ఎంత బాగా పెరిగితే సంపద కూడా పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కల్లో కలబంద కూడా ఒకటి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. కలబంద కూడా గాలిని ప్యూరి ఫై చేస్తుందని చెబుతున్నారు.